ఆస్తి కోసం ప్లాన్ వేసి తల్లిదండ్రులను చంపిన కసాయిలు

Two arrested for killing parents
మహబూబ్ నగర్: జిల్లాలో కసాయి కొడుకులు కన్నతల్లిదండ్రులను చంపేశారు. మహబూబ్ నగర్ జిల్లా వెల్దండ మండలం కుప్పగనుల గ్రామ శివారులో ఉండే బాలరాజు, ఈశ్వరమ్మ దంపతుల ఈ నెల 5వ తేదిన హత్యకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేశారు.

దర్యాఫ్తులో కొడుకులే వారిని హత్య చేసినట్లుగా తేలింది. ఆస్తికోసం హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. తల్లిదండ్రుల వద్ద స్థిరాస్థితో పాటు అధిక మొత్తంలో నగదు ఉంది. దీనిని గుర్తించిన ఇద్దరు కొడుకులు రవీంద్ర, వీరేంద్రలు దానిని తమకు పంచాలని ఒత్తిడి చేశారు. తల్లిదండ్రులు అంగీకరించక పోవడంతో వారు హత్య చేసి ఆస్తి పంచుకోవాలని ప్లాన్ చేశారు.

హైదరాబాదులో ఓ గొడవ ఉందని చెప్పిన వీరేంద్ర, రవీంద్ర వారిని ఓ కారులో తీసుకు వచ్చి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు పంటపొలాల్లో పడేశారు. ఈ కేసుకు సంబంధించి రవీంద్ర, వీరేంద్రలతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.

రైతులకు గాయాలు

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కావేరమ్మపేట శివారులోని పొలాల్లో అమర్చిన మందుగుండు సామాగ్రి పేలి ఇద్దరు రైతులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+