దొంగ నోట్లు చలామణి: రెడ్ హ్యాండెడ్‌గా ఒకరి పట్టివేత

విశాఖలో పేలుడు పదార్థాలు లభ్యం
విశాఖ జిల్లాలోని రోలుగుంటలో భారీగా అమ్మోనియం నైట్రేట్, జిలెటిన్ స్టిక్స్ తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. 32 బస్తాల అమ్మోనియం నైట్రేట్, 1500 డిటోనేటర్లు, 200 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు.
అక్షయపై కేసు
అక్షయ గోల్డ్ సంస్థ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు, చీరాలలో సిఐడి కేసులు నమోదు చేసింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సహా తొమ్మిది మందిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎనిమిది జిల్లాల్లో సంస్థ ఆస్తులను సిఐడి స్వాధీనం చేసుకుంది.
ఎక్సైజ్ శాఖ దాడులు
గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ దాడులు ముమ్మరం చేసింది. జిల్లాలో పలువురి పైన బైండోవర్ కేసులు నమోదు చేశారు. 64 బెల్టు షాపులను సీజ్ చేశారు.
Comments
English summary
With the arrest of one person from Vijayawada, the Krishna district police on Wednesday claimed to have busted a major fake note racket.