వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'టి'పై చర్చ ఉండదు: బొత్స, షిండేకు జగన్ పార్టీ లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana and Ys Jagan
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని తాను పార్టీ అధిష్టానానికి కోర్ కమిటీ భేటీలో చెప్పానని, సిడబ్ల్యూసిలో చర్చ జరగదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన సన్నిహితులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను నక్సల్స్, రాజకీయ అంశాల జోలికి వెళ్లలేదని చెప్పారని సమాచారం. సిడబ్ల్యూసిలో విభజన పైన చర్చ జరగదని, నిర్ణయం మాత్రమే తీసుకుంటారని ఆయన చెప్పారని తెలుస్తోంది.

రాష్ట్రాన్ని విభజించాలా? వద్దా? అనే దాని పైనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని తాను కోరినట్లు చెప్పారట. విభజించే పరిస్థితి వస్తే హైదరాబాదును ఇరవై అయిదేళ్లు కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలని కోరినట్లు చెప్పారట. పరిపాలన బాగుంటే నక్సల్స్ వంటి సమస్యలను ఎదుర్కోవచ్చునన్నారు.

కెసిఆర్ లాంటి సైంధవులు ఎందరు వచ్చినా... ఆనం

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు లాంటి సైంధవులు ఎందరు వచ్చినా రాష్ట్రాన్ని విభజించలేరని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి వేరుగా అన్నారు. సీమాంధ్ర ముఖ్యమంత్రుల వల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటే హాంకాంగ్‌లా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందన్నారు.

షిండేకు జగన్ పార్టీలేఖ

కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండేకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బుధవారం లేఖ రాసింది. కోర్ కమిటీ తర్వాత తెలంగాణపై కేంద్రం నిర్ణయం ప్రకటిస్తుందని రాష్ట్ర ప్రజలు ఆశించారని కానీ, ఇప్పుడేమో సిడబ్ల్యూసి అంటున్నారని అందులో పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణపై తన వైఖరిని వెల్లడించాలని, ఆ తర్వాత రాజకీయ పక్షాల అభిప్రాయం తేలాల్సి ఉందన్నారు.

English summary
It is said that PCC president Botsa Satyanarayana has suggested to make Hyderabad as UT for 25 years, if bifurcation is needed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X