వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పప్పీ ఎఫెక్ట్: బిఎస్పీ ఎంపీ సస్పెండ్, బిజెపి నేత రిజైన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narendra Modi - Mayawati
న్యూఢిల్లీ/లక్నో: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేసిన పప్పీ వ్యాఖ్యలను సమర్థించినందుకు బహుజన సమాజ్‌వాది పార్టీ(బిఎస్పీ) హమీర్‌పుర్ పార్లమెంటు సభ్యుడు విజయ్ బహదూర్ సింగ్‌ను బుధవారం సస్పెండ్ చేసింది. విజయ్‌ను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు పార్టీ అధ్యక్షురాలు మాయావతి చెప్పారు.

నరేంద్ర మోడీ గుజరాత్ అల్లర్లపై మాట్లాడుతూ చేసిన పప్పీ వ్యాఖ్యలు వివాదం రేపిన విషయం తెలిసింది. మోడీ వ్యాఖ్యలపై విజయ్ ఇటీవల స్పందిస్తూ... మోడీ వ్యాఖ్యలు వంద శాతం సరైనవేనని అన్నారు. విజయ్ వ్యాఖ్యలపై బిఎస్పీ మండిపడింది. ఈ రోజు ఆయనను బహిష్కరించింది.

ఢిల్లీలో రాజీనామా

మరోవైపు మోడీ వ్యాఖ్యల పైన అభ్యంతరం తెలిపిన ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు అమీర్ రాజా హుస్సేన్ తన పదవికి ఈ రోజు రాజీనామా చేశారు. ఆయన ఇటీవల మోడీ పప్పీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసి, అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. ముస్లింలు మోడీ కన్నా పార్టీ సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, సుష్మా స్వరాజ్‌ను ప్రధాని అభ్యర్థిగా ఇష్టపడతారని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఆయన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి. దాంతో ఎవరినీ నొప్పించడం తన ఉద్దేశ్యం కాదని, తన పదవికి రాజీనామా చేస్తున్నానని ఈ రోజు ప్రకటించారు. ఆయన రాజీనామాను అధ్యక్షుడు ఆమోదించారు.

English summary
Sitting BSP MP from Hamirpur Vijay Bahadur Singh was on Wednesday suspended by BSP chief Mayawati from the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X