పంచాయతీ: హరికృష్ణ థ్యాంక్స్, మైసూరా శుభాకాంక్షలు

మైసూరా కృతజ్ఞతలు
పంచాయతీలకు ఏకగ్రీవంగా ఎన్నికైన తమ పార్టీ మద్దతుదారులకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికైన అభ్యర్థులు ఏ పార్టీకి చెందినవారో తెలుసుకొని ఎన్నికల కమిషన్ ప్రకటిస్తే బాగుంటుందన్నారు.
ఎన్నికైన వారు ఏ పార్టీకి చెందిన వారో విచారించి ప్రకటించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వస్తే తాము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎవరికి వారు తమ ఇష్టమొచ్చినట్లుగా ప్రకటిస్తున్నారన్నారు. ఎవరు ఏ విధంగా ప్రచారం చేసుకున్న ప్రజల అభిమానం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైనే ఉందన్నారు.
కాగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో దాదాపు రెండువేల ఆరు వందల గ్రామాలలో సర్పంచులు ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, తెరాసలు మద్దతిచ్చిన అభ్యర్థులు చాలాచోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications