తెలంగాణపై త్వరలో నిర్ణయం: సుశీల్ కుమార్ షిండే

త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పిన షిండే.. ఆ నిర్ణయం కాంగ్రెసు పార్టీదా, యూపిఏ నిర్ణయమా లేక ప్రభుత్వానిదా అని కూడా వెల్లడించలేదు. కాగా గతంలోను షిండే తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 28న అఖిల పక్ష సమావేశం జరిగినప్పుడు నెల రోజుల్లో తేల్చుతామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలోనే మూడు: నారాయణ
తెలంగాణ విషయంలో కాంగ్రెసు పార్టీలోనే మూడు అభిప్రాయాలున్నాయని, అలాంటిది ఇతర పార్టీల ఏకాభిప్రాయం కోరడం శోచనీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వేరుగా అన్నారు.
సమైక్యాంధ్ర సభ: శైలజానాథ్
సిడబ్ల్యూసి సమావేశాల కన్నా ముందుగానే అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్ర సభ జరిగే అవకాశముందని మంత్రి శైలజానాథ్ అనంతపురంలో అన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. చిన్న రాష్ట్రాలు ఏర్పడితే ఎలా ఉంటుందో పక్క రాష్ట్రాలను చూస్తే అర్థమవుతోందన్నారు.












Click it and Unblock the Notifications