బొత్సకు అంతా తెలుసు, పులి బోన్లోనే: షర్మిలకు విహెచ్

మూడు వందల అరవై రోజులలో వైయస్ ఏనాడైనా మందు తాగలేదని చెప్పగలరా? అని బొత్స గురువారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విహెచ్ మాట్లాడారు. వైయస్ గురించి బొత్సకు బాగా తెలుసన్నారు. ఆయన ఇప్పటి వరకు ఒకటే బాణం వదిలారని, ఇంకా చాలా బాణాలు ఉన్నాయన్నారు.
అందరికీ అవకాశాలు రావని, కాంగ్రెసు పార్టీలో వైయస్‌కు అవకాశం వచ్చిందని, తమకు రాలేదు అంతే అన్నారు. వైయస్ కష్టంతో కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడిందనేది సరికాదన్నారు. అదే నిజమైతే 2004 కంటే 2009 సీట్లు ఎందుకు తగ్గాయని ప్రశ్నించారు. గత ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ 156 సీట్లలో మాత్రమే గెలిచిందన్నారు.
తన సోదరుడు పులి అని, అలాంటి పులిని జైలులో పెట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల అంటుంటారని, పులి బయట బయటి కంటే బోనులో ఉంటేనే మంచిదన్నారు. జగన్ బయటకు వస్తే రాష్ట్రాన్ని దోచేస్తాడని ఆరోపించారు.












Click it and Unblock the Notifications