సర్పంచ్ ఫలితాలు: ఏ రాజకీయ పార్టీ సత్తా ఎంత..

సర్పంచ్ ఎన్నికలు పార్టీరహితంగా జరిగినప్పటికీ అన్ని పార్టీలు తమ తమ మద్దతుదారులను పోటీకి దింపి బలాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు చేశాయి. పలు జిల్లాల్లో స్వతంత్రులు పెద్ద యెత్తునే గెలిచారు. వారు ఏ పార్టీకి మద్దతు ఇస్తారనే దాన్ని బట్టి పార్టీల బలాబలాలు తారుమారు కూడా కావచ్చు. మంగళవారం సాయంత్రం అందిన ఫలితాల ప్రకారం పార్టీల పరిస్థితి జిల్లాల్లో ఈ విధంగా ఉంది.
శ్రీకాకుళం జిల్లాలో..
మంగళవారం సాయంత్రం ఏడు గంటల వరకు అందిన ఫలితాలను బట్టి శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం తన సత్తా చాటింది. ఈ పార్టీ మద్దతుదారులు 108 మంది విజయం సాధించారు. కాంగ్రెసు పార్టీ మద్దతుదారులు 82 మంది గెలిచారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ (వైకాపా) 39 పంచాయతీలతో మూడో స్థానంలో నిలిచింది.
విజయనగరం జిల్లాలో..
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరం కాంగ్రెసు మద్దతుదారులు ఎక్కువ మంది గెలిచారు. కాంగ్రెసు మద్దతుదారులు 90 పంచాయతీల్లో విజయం సాధించగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 51 మంది సర్పంచ్ పదవులను గెలుచుకుంది. టిడిపి 43 స్థానాలతో మూడో స్థానంలో నిలిచింది.
విశాఖ జిల్లాలో
విశాఖపట్నం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీది పైచేయిగా ఉంది. ఈ పార్టీ 32 పంచాయతీలను గెలుచుకుంది. టిడిపి మద్దతుదారులు 19 మంది, కాంగ్రెసు మద్దతుదారులు 17 మంది విజయం సాధించారు.
తూర్పు గోదావరి జిల్లాలో..
తూర్పో గోదావరి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధిక్యత ప్రదర్సించింది. ఈ పార్టీ మద్దతుదారులు 42 మంది విజయం సాధించగా, తెలుగుదేశం మద్దతుదారులు 35 మంది, కాంగ్రెసు మద్దతుదారులు 31 మంది గెలిచారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో..
పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. ఈ పార్టీ మద్దతుదారులు 79 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. కాంగ్రెసు 42 పంచాయతీలను, వైకాపా 30 పంచాయతీలను దక్కించుకున్నాయి.
కృష్ణా జిల్లాలో..
కృష్ణా జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ తన ప్రాబల్యాన్ని చాటుకుంది. ఈ పార్టీ మద్దతుదారులు 62 మంది గెలువగా, కాంగ్రెసు మద్దతుదారులు 29 మంది, వైకాపా మద్దతుదారులు 25 మంది విజయం సాధించారు.
గుంటూరు జిల్లాలో..
గుంటూరు జిల్లాలో టిడిపి 83 స్థానాలతో రెండు పార్టీలపై ఆధిక్యత ప్రదర్శించింది. తర్వాతి స్థానాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దక్కించుకుంది. కాంగ్రెసు మద్దతుదారులు 20 మంది విజయం సాధించగా, వైకాపా అభ్యర్థులు 50 మంది విజయం సాధించారు.
ప్రకాశం జిల్లాలో
ప్రకాశం జిల్లాలో కూడా టిడిపి ఆధిక్యత చాటుకుంది. ఈ పార్టీ మద్దతుదారులు 78 పంచాయతీలను దక్కించుకున్నారు. కాంగ్రెసు మద్దతుదారులు 28 మంది, వైకాపా మద్దతుదారులు 44 మంది విజయం సాధించారు.
నెల్లూరు జిల్లాలో..
నెల్లూరు జిల్లాలో కాంగ్రెసు ఆధిక్యత చాటింది. కాంగ్రెసు మద్దతుదారులు 75 మంది గెలిచారు. వైకాపా మద్దతుదారులు 67 మంది, టిడిపి మద్దతుదారులు 55 మంది విజయం సాధించారు.
కర్నూలు జిల్లాలో..
రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి జిల్లా కర్నూలులో కాంగ్రెసు పార్టీ ఆధిక్యత ప్రదర్సించింది. కాంగ్రెసు మద్దతుదారులు 95 మంది విజయం సాధించగా, వైకాపా 42, టిడిపి 41 పంచాయతీలు గెలుచుకున్నాయి.
కడప జిల్లాలో..
వైయస్ జగన్ సొంత జిల్లా కడపలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హవానే నడిచింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారులు 89 మంది విజయం సాధించగా, కాంగ్రెసు మద్దతుదారులు 40 మంది, టిడిపి మద్దతుదారులు 17 మంది విజయం సాధించారు.
చిత్తూరు జిల్లాలో..
తన సొంత జిల్లా చిత్తూరులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఇదే జిల్లాకు చెందినవారు. టిడిపి ఈ జిల్లాలో ఆధిక్యత ప్రదర్సించింది. ఈ పార్టీ మద్దతుదారులు 116 మంది విజయం సాధించారు. రెండో స్థానం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి దక్కింది. ఈ పార్టీకి 88 పంచాయతీలు చేజిక్కాయి. కాంగ్రెసు 44 పంచాయతీలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లాలో టిడిపి ఆధిక్యత ప్రదర్శించింది. ఈ పార్టీకి చెందిన 129 మద్దతుదారులు విజయం సాధించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారులు 76 మంది, కాంగ్రెసు మద్దతుదారులు 52 మంది విజయం సాధించారు.
రంగారెడ్డి జిల్లాలో...
రంగారెడ్డి జిల్లాలో టిడిపి ఆధిక్యత చాటుకుంది. ఈ పార్టీ మద్దతుదారులు 37 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. కాంగ్రెసుకు 18 పంచాయతీలు దక్కగా, వైకాపాకు ఐదు, తెరాసకు మూడు పంచాయతీలు దక్కాయి.
మెదక్ జిల్లాలో..
తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు జిల్లా మెదక్‌లో తెరాస ఆధిక్యత ప్రదర్శించింది. ఈ పార్టీ మద్దతుదారులు 46 మంది సర్పంచులుగా విజయం సాధించారు. కాంగ్రెసుకు 27 పంచాయతీలు రాగా, టిడిపికి 9 వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సాయంత్రం 7 గంటల వరకు ఒక్క పంచాయతీ కూడా దక్కలేదు.
నిజామాబాద్ జిల్లాలో..
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెసు, టిడిపి పోటాపోటీగా తలపడ్డాయి. ఈ పార్టీల మద్దతుదారులు 40 చొప్పున గెలిచారు. తెరాసకు 25 పంచాయతీలు దక్కగా, వైకాపాకు ఒక్క స్థానం చిక్కింది.
కరీంనగర్ జిల్లాలో..
కరీంనగర్ జిల్లాలో కాంగ్రెసు ఆధిక్యత ప్రదర్సించింది. ఆ పార్టీ 48 పంచాయతీ సర్పంచులను గెలిపించుకోగా, తెరాస 32 స్థానాలను దక్కించుకుంది. టిడిపి సర్పంచు అభ్యర్థులు 27 మంది గెలిచారు. వైకాపా అభ్యర్థి ఒక్కరు మాత్రమే గెలిచారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలో టిడిపి 27 పంచాయతీ సర్పంచులను గెలిపించుకోగా, కాంగ్రెసు 17 మందిని గెలిపించుకుంది. తెరాసకు ఏడు దక్కాయి. వైకాపాకు ఒక్కటి కూడా దక్కలేదు.
వరంగల్ జిల్లాలో...
వరంగల్ జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉనికిని చాటుకుంది. ఆ పార్టీకి ఐదు పంచాయతీలు దక్కాయి. తెరాసకు అత్యధికంగా 39 పంచాయతీలు చిక్కాయి. కాంగ్రెసు 23, టిడిపి 17 స్థానాలు దక్కించుకున్నాయి.
నల్లగొండ జిల్లాలో...
నల్లగొండ జిల్లాలో కాంగ్రెసు ఆధిక్యత ప్రదర్సించింది. ఈ పార్టీ మద్దతుదారులు 51 మంది గెలిచారు. టిడిపి 22 పంచాయతీలను దక్కించుకోగా, తెరాస 39 పంచాయతీలను సాధించుకుంది. వైకాపాకు ఐదు పంచాయతీలు దక్కాయి.
మహబూబ్‌నగర్ జిల్లాలో...
మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెసు ఆధిక్యత ప్రదర్శించింది. ఈ పార్టీ 93 పంచాయతీలను దక్కించుకుంది. టిడిపి మద్దతుదారులు 78 మంది గెలిచారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 44 పంచాయతీలను గెలుచుకుంది. తెరాస నాలుగు స్థానాలు మాత్రమే దక్కాయి.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications