విపక్షాలదే బాధ్యత: టిజి వెంకటేష్, టిడిపియే: శైలజానాథ్

sailajanath and tg venkatesh
హైదరాబాద్: విభజనకు ప్రతిపక్ష నేతలే బాధ్యత వహించాలని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ మంగళవారం అన్నారు. రాష్ట్ర విభజనకు తాము పూర్తి వ్యతిరేకమని ఆయన ఈరోజు మరోసారి చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తమ పంథాను మార్చుకోవాలని సూచించారు.

సమైక్యాంధ్ర ఉద్యమానికి సీమాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేపట్టదలిచిన కార్యాచరణపై బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు సీమాంధ్ర ప్రాంత మంత్రులంతా సమావేశమవుతున్నట్లు టిజి వెంకటేష్ చెప్పారు. తాము త్వరలో ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని చెప్పారు.

కేంద్రంలోని మంత్రులందరినీ కలిసి సమన్వయపర్చి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలిపారు. తెలంగాణ ఇచ్చినా, ఇబ్బంది లేదంటూ రాజకీయ పార్టీలు అన్ని వ్యాఖ్యానించడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఎదురైందని ఆయన అన్నారు. విభజనకు విపక్షాలే బాధ్యత వహించాలన్నారు.

కీలక దశలో: శైలజానాథ్

రాష్ట్ర విభజన కసరత్తు కీలక దశలో ఉందనిపిస్తోందని మంత్రి శైలజానాథ్ వేరుగా అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ఎజెండాతో సీమాంధ్ర మంత్రులందరూ రేపు మినిస్టర్స్ క్వార్టర్సులో భేటీ అవుతారన్నారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కలుస్తామని చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగులు, ఇతర సంఘాలు సమైక్య ఉద్యమానికి సిద్ధపడటం సంతోషకరమన్నారు. తెలంగాణ ఏర్పాటుకు అభ్యంతరం లేదంటూ కేంద్రానికి లేఖ ఇచ్చిన టిడిపి దీనికి ప్రధాన బాధ్యత వహించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+