అందమైన అమ్మాయిలను ఎరగా వేసి బ్లాక్‌మెయిల్

ఈ ముఠా పైన బెంగళూరు, మంగళూరు, కేరళ తదితర ప్రాంతాల్లో పలు ఫిర్యాదులు అందాయి. తన దుకాణానికి ఓ యువతి వచ్చిందని, స్నేహం అంటూ తనకు ఆమె ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిందని, తర్వాత ఆమె ద్వారా తాను మోసపోయానని మంగళూరుకు చెందిన ఓ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మధ్యాహ్న భోజనంలో బల్లి
హర్యానాలోని పాల్వాయ్‌లో ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో చచ్చిన బల్లి కనిపించడంతో విద్యార్థులు తల్లడిల్లి పోయారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమకు ఆహారంలో చిన్న చిన్న క్రిమికీటకాలు తరుచూ కనిపిస్తూనే ఉంటాయని పిల్లలు చెప్పారు. దీంతో గ్రామస్థులు మండిపడ్డారు.
కానిస్టేబుళ్లు సస్పెండ్
కడప జిల్లా ఖాజీపేట మండలం చెన్నముక్కపల్లెలలో ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక హెడ్ కానిస్టేబుల్‌ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. రైతును తనిఖీ చేసి రూ.30వేలుతీసుకున్నారని కానిస్టేబుళ్లపై బాధితుడు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై ఎస్పీ చర్యలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications