హోటల్లో రాంచీ ఆర్జే స్నేహసింగ్ మృతి, రేప్ అనుమానం
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీ పట్టణంలోని తొలి రేడియో ఆర్జే స్నేహా సింగ్ మృతి చెందింది. ఆమె బీహార్ రాష్ట్రం ముంగార్ జిల్లాలోని ఓ హోటల్ గదిలో ఫ్యానుకు వేలాడుతూ బుధవారం కనిపించింది. స్నేహా సింగ్ వయస్సు 25. రాంచీ పట్టణంలో స్నేహా పాపులర్ రేడియో జాకీ(ఆర్జే).
2008 నుండి 2010 మధ్యలో ఆమె పాపులర్ అయ్యారు. హెచ్‌టి సమాచారం మేరకు... రాంచీలోని సెయింట్ గ్జావియర్స్ కళాశాలలో ఎంబియే పూర్తి చేసిన అనంతరం స్నేహ గత కొన్ని నెలలుగా బీహార్ రాష్ట్రంలోని జీవిక అనే ఎన్జీవో సంస్థతో కలిసి పని చేస్తున్నారు.
ఈ రోజు ఆమె మృతదేహాన్ని పోలీసులు ఓ హోటల్ గదిలో కొనుగొన్నారు. గది నెంబర్ 101లో ఉన్న ఆమె మృతదేహం అర్ధ నగ్నంగా ఉంది. దీంతో పోలీసులు ఆమెది ఆత్మహత్యగా కాకుండా హత్య లేదా అత్యాచార హత్యగా అనుమానిస్తున్నారు.
ఏం జరిగిందనేది పోస్టుమార్టం రిపోర్టు అనంతరమే తెలుస్తుందని ముంగార్ సూపరింటెండెట్ పోలీసు నవీన్ చంద్ర ఝా చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణులు పూర్తి ఆధారాలు సేకరించారు. కేసు ప్రస్తుతం దర్యాఫ్తులో ఉంది.
కాగా మృతికి ముందు స్నేహా సింగ్ తన మొబైల్ నుండి సన్నిహితులతో గంటకు పైగా మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications