వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ సైన్: సీమాంధ్రలో జగన్‌పై కాంగ్రెసు అస్త్రం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోనహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి కాంగ్రెసు పార్టీ అస్త్రం సిద్ధం చేసుకున్నట్లే కనిపిస్తోంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యవాద పార్టీగా ప్రజల మద్దతు కొట్టేయాలనే వ్యూహానికి కాంగ్రెసు కత్తెర వేసే ప్రయత్నాలకు సిద్దమవుతున్నట్లే కనిపిస్తోంది. రాష్ట్ర విభజనకు పాదులు వేసిందే జగన్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కారణమనే వాదనను కాంగ్రెసు పార్టీ నాయకులు సీమాంధ్రలో వినిపించే అవకాశాలున్నాయి.

తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని లగడపాటి రాజగోపాల్, టిజి వెంకటేష్ వంటి సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు నాయకులు ఇప్పటికే విమర్సిస్తున్నారు. జగన్‌ను కూడా అదే పద్దతిలో విమర్శిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పేరుతో ఓట్లను సంపాదించుకోవాలనే జగన్ ప్రయత్నాలకు వైయస్ చర్యనే అడ్డం పెట్టే ఆలోచన ముందుకు వస్తోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని గద్గె దింపడానికి వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణను ముందుకు తెచ్చారనే ఆరోపణ ముందుకు వచ్చింది.

YSR - YS Jagan

ప్రధాని మన్మోహన్ సింగ్ తనను కలిసి, విభజన వద్దని విన్నవించిన నాయకులతో వైయస్ రాజశేఖర రెడ్డి అంశాన్నే ప్రస్తావించారు. 2004కు ముందు వైయస్ రాజశేఖ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, తెలంగాణ ఇవ్వాలంటూ 32 మంది ఎమ్మెల్యేలతో చిన్నారెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీకి పంపిన లేఖను ప్రధాని గుర్తు చేశారు. అందులో వైఎస్ సంతకం కూడా ఉందని ఆయన చెప్పారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమం లేదని, తెలుగుదేశం పార్టీ అప్పట్లో విభజనకు అనుకూలం కాదని, అలాంటి పరిస్థితుల్లో ఈ అంశాన్ని కదిలించింది మన పార్టీవాళ్లే కదా అని, మేడమ్ సోనియా ఇదే అడుగుతున్నారని ప్రధాని అన్నట్లు సమాచారం.

ప్రధాని వాదనను సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు అస్త్రంగా అందుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని సీమాంధ్రలో ఎదుర్కోవడానికి సిద్ధపడవచ్చు. తెలుగుదేశం పార్టీ కూడా అదే వాదనను తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలున్నాయి. తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీవ్రంగా దెబ్బ తింటోంది. సమైక్యవాదంతో సీమాంధ్రలో మిగతా పార్టీలను దెబ్బ తీయాలనే వైయస్ జగన్ ఎత్తుగడలకు కూడా గండి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్నిబట్టి, విభజన జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో జగన్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని చెప్పడానికి కూడా ఏమీ లేదు.

English summary
It is said that Congress may use YS Rajasekhar Reddy action on Telangana to counter YSR Congress party president YS Jagan in Seemandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X