వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి: అసదుద్దీన్ మరో ట్విస్ట్, రాజీనామా చేయను: కిషోర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Asaduddin Owaisi
హైదరాబాద్/న్యూఢిల్లీ: తాము రాష్ట్ర విభజనకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. తమది సమైక్యవాదమే అన్నారు. విభజనను ఒప్పుకునేది లేదని చెప్పారు. రాయల తెలంగాణ అయినా, పది జిల్లాలతో కూడిన తెలంగాణను అంగీకరించమన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ఒప్పుకోమన్నారు. కాగా విభజనకు ఒప్పుకోమని, అనివార్యమైతే రాయల తెలంగాణ అన్న మజ్లిస్ ఇప్పుడు దానిని కూడా అంగీకరించేది లేదని చెప్పడం గమనార్హం.

రాజీనామా చేయను: కిషోర్

తెలంగాణపై తన అభిప్రాయం ఎప్పుడో చెప్పానని కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ అన్నారు. అయితే అంతిమంగా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. రాజీనామా చేసే ప్రసక్తి లేదన్నారు. కేంద్రమంత్రి వర్గంలో తన అభిప్రాయాన్ని మరోసారి చెబుతానన్నారు. అధిష్టానానికి ఏం చేయాలో అన్నీ తెలుసునన్నారు.

నిర్ణయం ఉండదు: అనంత

తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకోరని అనంతపురం పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. యూపిఏ, సిడబ్ల్యూసి సమావేశంలో చర్చలు మాత్రమే ఉంటాయన్నారు. రాజీనామాలపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

సమైక్యవాదిని: కోట్ల

తాను సమైక్యవాదినేనని కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, లేదంటే మూడుగా విభజించాలన్నారు. రెండేళ్ల క్రితం సమైక్యాంధ్ర కోసం మొట్టమొదట రాజీనామా చేసింది తానే అన్నారు.

ముఖ్యమంత్రితో మంత్రుల భేటీ

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మంత్రులు గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టిజి వెంకటేష్, ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఎమ్మెల్యే వీరశివా రెడ్డి తదితరులు భేటీ అయ్యారు.

విభజనకు ఒప్పుకోం: శ్రీకాంత్ రెడ్డి

రాష్ట్ర విభజనకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయల తెలంగాణ కోసం తాము ఉద్యమించడం లేదన్నారు.

English summary
MIM chief and Hyderabad MP Asaduddin Owisi said that they will strongly oppose any move to divide Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X