వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాయల తెలంగాణపై పై నాగం, కిరణ్ రాజీనామాపై శ్రీధర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ కొత్తగా రాయల తెలంగాణ లింక్ ఎందుకు పెడుతోందని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి సోమవారం ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీ రాయల తెలంగాణ ఇచ్చినా రేపు తమ పార్టీ అధికారంలోకి వచ్చాక కర్నూలు, అనంతపురం జిల్లాలను తిరిగి ఆంధ్రా ప్రాంతానికి ఇచ్చేస్తామన్నారు. తమకు పది జిల్లాల తెలంగాణనే కావాలని, మా బతుకేదో మేం బతుకుతామని, తమపై ఎవరి పెత్తనం వద్దన్నారు.

రాయల తెలంగాణపై పార్లమెంటులో బిల్లు పెడితే తాము సవరణ కోరుతామని చెప్పారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలుపాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టవద్దని నాగం జనార్ధన్ రెడ్డి సూచించారు.

తెలగాణకు తాము వ్యతిరేకం కాదని ఎన్సీపి ప్రధాన కార్యదర్శి, ఎంపి తారిక్ అన్వర్ న్యూఢిల్లీలో అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల తమ పార్టీ వైఖరి సుస్పష్టమన్నారు. చిన్న రాష్ట్రాల కోసం చాలాచోట్ల ఆందోళనలు ఉన్నా తెలంగాణ డిమాండ్ ఎప్పటి నుండో ఉందని, తెలంగాణ డిమాండును వేరే వాటితో పోల్చడం సరికాదన్నారు.

శ్రీధర్ బాబు

శ్రీధర్ బాబు

విభజన జరిగితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని, సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేయకుండా తెలంగాణకు సహకరించాలని ఆయన కోరారు. తమ ప్రాంత ప్రజలు రాయల తెలంగాణను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.

ఆనం వివేకానంద రెడ్డి

ఆనం వివేకానంద రెడ్డి

రాష్ట్రాన్ని విభజిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. రాయల తెలంగాణ అంటే ఒప్పుకోమన్నారు. హైదరాబాదు అభివృద్ధిలో తమ చెమట, రక్తం దాగి ఉందని ఆనం వ్యాఖ్యానించారు.

నాగం జనార్ధన్ రెడ్డి

నాగం జనార్ధన్ రెడ్డి

కాంగ్రెసు పార్టీ రాయల తెలంగాణ ఇస్తే బిజెపి అధికారంలోకి వచ్చాక అనంతపురం, కర్నూలు జిల్లాలను తిరిగి ఆంధ్రా ప్రాంతంలో కలుపుతుందని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు.

తెలంగాణకు వ్యతిరేకం కాదు: ఎన్సీపి

తెలంగాణకు వ్యతిరేకం కాదు: ఎన్సీపి

తెలగాణకు తాము వ్యతిరేకం కాదని ఎన్సీపి ప్రధాన కార్యదర్శి, ఎంపి తారిక్ అన్వర్ న్యూఢిల్లీలో అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల తమ పార్టీ వైఖరి సుస్పష్టమన్నారు. చిన్న రాష్ట్రాల కోసం చాలాచోట్ల ఆందోళనలు ఉన్నా తెలంగాణ డిమాండ్ ఎప్పటి నుండో ఉందని, తెలంగాణ డిమాండును వేరే వాటితో పోల్చడం సరికాదన్నారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ను ఎలా పడితే అలా మార్చేందుకు ఈ రాష్ట్రం కాంగ్రెసు ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ కాదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను ఎందుకు తెరమీదకు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. బిజెపి లేకుంటే బిల్లు పాస్ కాదన్నారు. ప్రజలు రాయల తెలంగాణ అడగలేదన్నారు. ఉమ్మడి రాజధానికి తాము వ్యతిరేకమని, రెండు రాష్ట్రాలు, రెండు రాజధానులు కావాలన్నారు.

English summary
BJP leader and Nagarkurnool MLA Nagam Janardhan Reddy said on Monday that they will oppose Rayala Telangana statehood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X