చింతచిగురు ఎండు రొయ్యల కూర.. ఇలా వండితే పండుగే!

ఆరోగ్యం బాగుండాలి అంటే మంచి ఆహారం తినాలి. ఆ ఆహారం పోషకాలు ఉన్నది కావాలి. అటువంటి ఆహారాలలో చింతచిగురు ఎండురొయ్యలు కూర ఒకటి. చింతచిగురు ఎండు రొయ్యల కూర (Chinthachiguru endu Royyala Curry) — ఆంధ్ర స్టైల్‌లో చాలా రుచిగా ఉండే వంటకం.

కావలసిన పదార్థాలు:

ఎండు రొయ్యలు (శుభ్రం చేసినవి) – 250 గ్రా

చింతచిగురు (తాజాగా) – 1 కప్పు

ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)

టమాటాలు – 2 (తరిగినవి)

పచ్చిమిర్చి – 3-4

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్

కారం – 1 టీస్పూన్

పసుపు – ¼ టీస్పూన్

ఉప్పు – తగినంత

ధనియాల పొడి – 1 టీస్పూన్

నూనె – 2 టేబుల్ స్పూన్లు

కరివేపాకు – కొద్దిగా

కొత్తిమీర – అలంకరణకు

Chintachiguru Endu Royyalu Curry Recipe And Cooking Tips cook in this way for delicious curry

తయారీ విధానం:

ముందుగా ఎండు రొయ్యలను శుభ్రం చేసి కొద్దిగా నీళ్ళలో వేసి కడిగి, గట్టిగా పిండి, నీళ్ళు లేకుండా చేసి పక్కన పెట్టాలి.పాన్‌లో నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి అవి వేగే దాకా కలుపుకోవాలి, తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు కలపాలి.టమాటాలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు వేసి కలపాలి.

ఇలా వండితే చింత చిగురు ఎండు రొయ్యలు సూపర్ టేస్ట్

ఎండు రొయ్యలు వేసి బాగా కలిపి 5 నిమిషాలు మూత పెట్టి వండాలి. చివరగా చింతచిగురు వేసి బాగా కలిపి 5-7 నిమిషాలు ఉడికించాలి. కూర కాస్త గట్టిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో అలంకరించాలి.ఈ కూర వేడి వేడి అన్నం లేదా జొన్న రోటీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. వేసవిలో ముఖ్యంగా ఏప్రిల్ , మేనెలల్లో చింత చిగురు బాగా దొరుకుతుంది. దీంతో ఇలా ఎండు రొయ్యలు కలిపి వండి తిని చూడండి.. దీనిని మీరు అసలే వదిలిపెట్టరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+