కోదండరామ్ లాగే సమైక్యాంధ్ర ఉద్యమం: గంటా

సమైక్యాంధ్ర కోసం ఇప్పటి వరకు వివిధ వర్గాలు వేర్వేరుగా ఉద్యమాలు చేస్తున్నాయని, ఆ వర్గాలను అన్నింటినీ ఏకతాటి మీదికి తెచ్చి సమైక్యాంధ్ర జెఎసిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని, దానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేని వ్యక్తి నేతృత్వం వహించేలా చూసుకోవాలని, తెలంగాణలో కోదండరామ్‌ను తెచ్చుకున్నట్లుగానే తాము ఇక్కడ ఓ వ్యక్తిని ఏర్పాటు చేసుకోవాలని ఆయన అన్నారు.
ఉద్యమాన్ని ఉధృతం చేసే విషయంపై మరో రెండు రోజుల పాటు చర్చలు చేసి ముందుకు సాగుదామని ఆయన చెప్పారు. రాజకీయ పార్టీల ప్రయోజనాలు లక్ష్యం కాకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకుని పోవాలని ఆయన అన్నారు. తెలంగాణను ఆంధ్ర ఉద్యోగులు ఖాళీ చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అంటున్నారని, దీన్ని బట్టి భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో అంచనా వేసుకోవచ్చునని ఆయన అన్నారు.
కేంద్ర మంత్రి చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు మొదటి నుంచీ రాష్ట్ర విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications