వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌కు తెలంగాణ ఇష్టం లేదు: సోమిరెడ్డి వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

somireddy chandramohan reddy and kcr
హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజించడం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు ఇష్టం లేదని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.. సంఘ విద్రోహ శక్తిగా వ్యవహరిస్తున్న కెసిఆర్‌కు కేంద్రం చెక్‌ పెట్టాలని, కెసిఆర్ వ్యాఖ్యలపై దిగ్విజయ్‌సింగ్ వివరణ ఇవ్వాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

విభజన ఇష్టం లేకనే కడుపు మంటతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణ వీడాలని అంటున్న కెసిఆర్ రేపు ప్రజలను కూడా ఇలాగే అంటారని ఆయన అన్నారు. దేశం విడిచి ఇటలీకి వెళ్లిపోవాలని కెసిఆర్ సోనియా గాంధీకి చెప్పగలరా అని ఆయన అడిగారు.

కెసిఆర్ వ్యాఖ్యలను ఖండించిన దామోదర

సీమాంద్ర ఉద్యోగులపై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో నివసించే హక్కు ప్రతీ భారతీయుడికి ఉందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులకు పూర్తి భద్రత కల్పిస్తామని దామోదర హామీ ఇచ్చారు.

సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్ విడిచివెళ్లాలని కెసిఆర్ వ్యాఖ్యలను మంత్రి డికె అరుణ ఖండించారు. సర్వీస్ రూల్స్ ప్రకారమే చర్యలు ఉంటాయని ఆమె శనివారం మహబూబ్‌నగర్ జిల్లాలో మీడియా ప్రతినిధులతో అన్నారు.సీమాంధ్ర మంత్రులు సంయమనం పాటించాలని ఆమె కోరారు.

సీమాంధ్రలో ఉద్యమం జరుగుతున్న సమయంలో కెసిర్ వ్యాఖ్యలు సరికాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు విభజనకు అడ్డంకి అవుతాయన్నారు. హైదరాబాద్‌లో నివసించే సీమాంద్రులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. రెండు రాష్ట్రాలు ఏర్పడితే, వేగంగా అభివృద్ధి చెందుతాయని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

సీమ నేతలకు ముందు చూపు లేదు

రాయలసీమ ప్రాంత నాయకులకు ముందు చూపు లేదని రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. నాటకాలాడి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అందరూ రాయలసీమాంధ్రులు కావాలని పిలుపునిచ్చారు. కారుకూతలు కూస్తే సహించేది లేదని హెచ్చరించారు.

తమ వాళ్లను తాము కాపాడుకుంటామన్నారు. సమైక్యవాదాన్ని వదలాలని బైరెడ్డి అన్నారు. ప్రత్యేక సీమ కోసం పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. సీమలో ముగ్గురు పహిల్వాన్లు ఉన్నారని, ఇంటి దొంగలకు బుద్ది చెప్పేందుకే పార్టీ పెడుతున్నట్లు బైరెడ్డి తెలిపారు.

English summary

 The Telugudesam party leader Somireddy Chandramohan reddy said that Telangana Rastra Samithi president K Chandrasekhar Rao does not want the bifurcation of Andhra Pradesh state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X