అసెంబ్లీ తీర్మానం కావాల్సిందే: ఉండవల్లి, ఫ్లెక్సీ గొడవ

హైదరాబాదును దేశానికి రెండో రాజధానిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య విభేదాలు రావచ్చునని, అలా రాకుండా ఉండాలంటే హైదరాబాదులో రెండో రాజధాని ఏర్పాటు చేయాలని అంబేడ్కర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఏ గొడవ రాకుండా హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేయాలని ఆయన అన్నారు. 57 ఏళ్లు రాజధానిగా ఉన్న హైదరాబాదును ఎలా వదిలి పెడతామని ఆయన అన్నారు. హైదరాబాదులో నివసిస్తున్నవాళ్లు తమకు మద్దతు ఇస్తారని ఆయన అన్నారు. హైదరాబాదును రోండో రాజధానిగా చేయాలని హైదరాబాద్ మేధావులు కోరుతున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తన మాట వినకుంటే అద్దాలు పగులగొడుతారని, అలా పగులగొట్టకూడదంటే హైదరాబాద్ రెండో రాజధానిగా ఉండాలని ఆయన అన్నారు. లెక్కలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. తెలంగాణ, ఆంధ్రలకు ఇదే ఆఖరు ఉద్యమం కావాలని, పరిష్కారం కావాలని ఆయన అన్నారు. పార్టీ ప్రయోజనాల కన్నా ప్రాంత ప్రయోజనాల కన్నా ముఖ్యమని అయన అన్నారు. హైదరాబాదు రెండో రాజధానిగా ఉండడంతో పాటు రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉండాలని ఆయన అన్నారు. హైదరాబాదు రెవెన్యూను కౌన్సిల్ ఏర్పాటు చేసి, దాని ద్వారా పంచుకుందామని ఆయన అన్నారు.
ప్రస్తుత వివాదం పార్టీలకు సంబంధించింది కాదని, రెండు ప్రాంతాలకు సంబంధించిందని ఆయన అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉండేవారు ఎవరూ ప్రత్యేక రాష్ట్రం అడగడం లేదని ఆయన అన్నారు. హైదరాబాదు రాజ్యంలో ఉండే ఎనిమిది జిల్లాలను నాలుగేసి చొప్పున మాహారాష్ట్రలో, కర్ణాటకలో కలిపారని ఆయన అన్నారు. ఈ చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ వస్తుందని భయపడుతున్న మొదటి వ్యక్తి కెసిఆర్ అని ఆయన అన్నారు. రక్తపాతం జరగకుండా, కొట్లాట జరగకుండా తెలంగాణ ఏర్పడుతుందని కెసిఆర్ అనుకుంటున్నారని ఆయన అన్నారు. ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని కెసిఆర్ అనడాన్ని ఆయన తప్పు పట్టారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ మాత్రమే నిర్ణయం తీసుకుందని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి చివరి వరకు ప్రయత్నాలు చేద్దామని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఆదివారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో 'జై ఆంధ్రప్రదేశ్' ఫ్లెక్సిలపై వివాదం చెలరేగింది. సభ జరుగుతుండగా కొంత మంది ఆందోళనకారులు వేదికపైకి వెళ్ళి ఆ ఫ్లెక్సీలను చింపివేసి 'జై సమైక్యాంధ్ర' అంటూ నినాదాలు చేశారు. ఉండవల్లి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆందోళన కారులను బయటకు పంపివేశారు. వారు వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications