చిరు వల్లే విభజన: దేవినేని, ఎస్కేలో ఎంపీకి చుక్కెదురు

వారు చిత్తూరులో పూర్ణ కుంభం వద్ద తెలుగు తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌కు విభజనపై మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. చిరు కారణంగానే విభజన జరుగుతోందన్నారు. కేంద్రమంత్రులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా సీమాంధ్రలో ఐదో రోజు ఆందోళన కొనసాగుతోంది.
సికె బాబుకు స్వల్ప అస్వస్థత
సమైక్యాంధ్ర కోసం మూడ్రోజులుగా దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే సికె బాబు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
అనంతకు చుక్కెదురు
అనంతపురం పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామి రెడ్డికి శ్రీకృష్ణ విశ్వవిద్యాలయంలో చుక్కెదురైంది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు ఆయన వెళ్లారు. విద్యార్థులు ఆయనను అడ్డుకొని ఎంపీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రాజీనామా చేసి, దానిని ఆమోదించుకున్నాక రావాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర కోసం తాము నిద్రాహారాలు మాని ఆందోళన చేస్తుంటే మీరేం చేస్తున్నారని, తమ మనోభావాలు పట్టవా అని నిలదీశారు.
ఆత్మహత్యాయత్నం
సమైక్యాంధ్ర కోసం ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం లింగారెడ్డిపల్లెలో ఇది చోటు చేసుకుంది.
కెసిఆర్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: పొన్నం
సీమాంధ్ర ఉద్యోగులపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. డిజిపి శాంతిభద్రతలు కాపాడటంలో విఫలమయ్యారన్నారు. ట్యాంకుబండు పైన విగ్రహాలు కూల్చినప్పుడు చీకటి రోజులు అన్న వారు, ఇప్పుడు మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications