ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా రాజ్యసభకు హరికృష్ణ రాజీనామా

Hari Krishna
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరకృష్ణ ఆదివారం ఉదయం రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ ఆయన తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్‌కు పంపించారు. మరో లేఖను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు.

ఆయన ఎన్టీఆర్ ఘాట్ వద్ద మొదట నివాళులు అర్పించారు. అనంతరం రాజీనామా లేఖను పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కేంద్రం నిర్ణయం ప్రతి తెలుగు వాడిని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.

విభజనకు తాను, తమ పార్టీ వ్యతిరేకం కాదని అయితే, విభజన జరిగిన తీరును నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. నిర్ణయం తీసుకునే ముందు అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పూర్తిస్థాయిలో తెలుసుకోలేదని విమర్శించారు. కాగా రెండు రోజుల క్రితమే టిడిపి ఎంపీలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

కాగా, ఒక ప్రాంత ప్రజాభీష్టానికి తలవంచి తారక రాముడి బిడ్డగా తాను విభజనను అంగీకరిస్తున్నానని హరికృష్ణ శుక్రవారం ప్రజలకు బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. తాను బాధగానే విభజనను అంగీకరిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన నిప్పులు చెరిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+