'జగన్ చంచల్‌గూడ సిఎం, రాజ్ న్యూస్‌ను తీసుకున్నాం'

దేశంలో అనేక పార్టీలు కుటుంబ పార్టీలుగా మారాయని, బిజెపి మాత్రం ప్రజల పార్టీ అన్నారు. కాబట్టే ఒకప్పుడు చాయ్ అమ్ముకునే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బిజెపిలో అంచెలంచెలుగా ఎదిగి ప్రధాన మంత్రి పదవికి పోటీపడే స్థాయికి చేరుకున్నారని గుర్తు చేశారు. పార్టీ పరంగా రాజ్‌న్యూస్‌ను తీసుకున్నామని, ఈ నెల్లోనే అది ప్రారంభమవుతుందని చెప్పారు.
ఆంధ్ర ఉద్యోగులు వారి ప్రాంతానికి వెళ్లిపోవాల్సిందేనంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆంధ్ర ఉద్యోగులు వారి ప్రాంతానికి వెళ్లిపోవాల్సిందేనంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని, అలా ఎవరు చేసినా అవి తెలంగాణ విభజనకు అవరోధంగా మారే అవకాశముందన్నారు.
అలాంటి వ్యాఖ్యలతో సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నట్లుగా కనిపిస్తోందన్నారు. అందుకే బాధతో, ఆగ్రహంతో వారు ఉద్యమిస్తున్నారన్నారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, బిజెపి తరఫున సీమాంధ్రులకు భరోసా ఇస్తున్నామని, హైదరాబాద్‌లో ఎవరికీ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి బిజెపి అండగా ఉంటుందన్నారు. ఉద్యోగుల బదిలీలు, మార్పులన్నీ ప్రభుత్వ విధానాల మేరకే జరుగుతాయన్నారు. ఎవరూ భయభ్రాంతులకు గురి కావొద్దన్నారు.












Click it and Unblock the Notifications