నిరసన: సోనియాకు కర్మ, తాగి పడుకోవాలని కెసిఆర్‌పై

Sonia Gandhi
విజయవాడ/విశాఖ: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీసుకున్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, దానిని ప్రకటించిన ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పైన సమైక్యవాదులు నిప్పులు చెరుగుతున్నారు. సమైక్యవాదులు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు.

సోనియా, దిగ్విజయ్‌లకు పెద్ద కర్మ అంటూ పత్రిక కొట్టించారు. అనంతపురం జిల్లాకు చెందిన సమైక్యవాదులు సోనియా, దిగ్విజయ్‌లు సమైక్యాంద్రుల ఉద్యమ సెగ తగిలి జూలై 30న స్వర్గస్థులయ్యారని, నాలుగో తేదీ వారి పెద్ద కర్మ అని పేర్కొంటూ వైకుంఠ సమారాధన ఆహ్వాన పత్రిక పంచి పెడుతున్నారు.

ఫుల్‌గా తాగు.. ఫాంహౌస్‌లో నిద్రపో

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫుల్‌గా తాగి, ఫాంహౌస్‌లో నిద్రపోతాడంటూ సమైక్యవాదులు వినూత్నంగా నిరసన తెలిపారు. "కె'చీ'ఆర్ ఫుల్‌గా తాగు హాయిగా ఫామ్ హౌస్‌లో నిద్రపో. దయచేసి బయటకు రావద్దు. నోరు తెరవద్దు-ఖబడ్దార్'' అంటూ గుంటూరు తాలూకా సెంటర్‌లో మాదిగ సేవాదళ్ కటౌట్ ఏర్పాటు చేసి నిరసన తెలిపింది.

సీమాంధ్ర ఉద్యోగులు ఆంధ్రాకు వెళ్లిపోవాల్సిందేనని, వాళ్లకు ఆప్షన్లు లేవని కెసిఆర్ శుక్రవారం హైదరాబాద్‌లో వ్యాఖ్యానించడంపై సేవాదళ్ మండిపడింది. సీమాంధ్ర ఉద్యోగులపై కన్నెత్తినా, నోరెత్తినా ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. సీమాంధ్ర ఉద్యోగులపై కెసిఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని సుధాకర్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+