సిఎం క్యాంప్ ఆఫీస్‌లో భేటీని తప్పుపట్టిన రేవంత్ రెడ్డి

కిరణ్ సీమాంధ్రకే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జాతీయ నేతల విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే చర్యలు తీసుకోవడం లేదన్నారు. కిరణ్ వెంటనే రాజీనామా చేయాలని, లేదంటే ఆయనను బర్తరఫ్ చేయాలన్నారు. సీమాంధ్రలో ప్రజలను బుజ్జగించే క్రమంలో తెలంగాణ ప్రజల మనోభావాలు గాయపడకుండా సున్నితంగా వ్యవహరించాలని కోరారు. తెలంగాణపై రాష్ట్రపతికి తీర్మానం పంపినప్పుడే తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైనట్టు భావిస్తామన్నారు.
హైదరాబాద్ ప్రజల రక్షణ బాధ్యత మాదే
రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు తాము రాజీనామా చేస్తున్నామని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అనంతపురంలో అన్నారు. హైదరాబాదులోని సీమాంధ్రులకు పూర్తి రక్షణ కల్పించే బాధ్యత తమదేనని చెప్పారు.
అధిష్టానంపై ఒత్తిడి
రాజీనామాలు చేయకుండానే తాము సమైక్యాంధ్ర కోసం అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వస్తామని మంత్రి పార్థసారథి అన్నారు. సమైక్యాంధ్ర కోసం రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఏర్పాటు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications