టిఆర్ఎస్ నుండి 8మంది కాంగ్రెస్‌లోకి: దిలీప్ అల్టిమేటం

తెరాసను కాంగ్రెసులో విలీనం చేయాలంటే చేయాలని, సమయం వృథా చేయవద్దని సూచించారు. కేంద్రమంత్రి అజిత్ సింగ్, ఎపి కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ల ద్వారా తమను కాంగ్రెసులో చేర్చాలని ఎనిమిది మంది తెరాస నేతలు తనను సంప్రదించారన్నారు.
తెరాస ఏ నిర్ణయం తీసుకుంటుందో వారం రోజులు చూస్తానని, లేకుంటే తానే వారిని కాంగ్రెసులో చేర్చుతానని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు కూడా కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మరోవైపు పలువురు తెరాస నేతలు ఢిల్లీ వెళ్లి పెద్దలతో కలుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
తెరాసకు 11 సీట్లే: విజయశాంతి
రాబోయే సాధారణ ఎన్నికలలో తెరాసకు పది లేదా పదకొండు సీట్లు మాత్రమే వస్తాయని, కాంగ్రెసు పార్టీకి ఎనబై సీట్ల వరకు వస్తాయని మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి అన్నారు. తెలంగాణలో కాంగ్రెసు అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications