వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీల్డ్ కవర్ సిఎం అంత మొనగాడయ్యారా?: కోమటిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

komatireddy venkat reddy
నల్గొండ: తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ భిక్షతో ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి, సిడబ్ల్యూసి తీర్మానాన్ని వ్యతిరేకించే మొనగాడయ్యారా? అంటూ మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. ఇక తమ పోరాటం ముఖ్యమంత్రి పైనేనని చెప్పారు. ఆయనను అధిష్టానం వెంటనే బర్తరఫ్ చేయాలని కోరారు.

తెలంగాణ ప్రాంత మంత్రులు ఆయనను తక్షణమే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాల్లోనే ఆయనను ఎవరూ ముఖ్యమంత్రిగా చూడటం లేదన్నారు. ముఖ్యమంత్రి చెప్పినవన్నీ దొంగ లెక్కలేనని ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అభూత కల్పనలతో రాష్ట్ర ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం దారుణమన్నారు. సీల్డ్ కవర్ సిఎంకు అదిష్టానాన్ని వ్యతిరేకించే ధైర్యమా అని ప్రశ్నించారు. ఆయన వెంటనే తప్పుకోవాలన్నారు.

రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు కేంద్రం ఏమేం చేయాలో సూచించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ కాంగ్రెస్, తెలుగుదశం పార్టీ నాయకులు తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా కిరణ్ మాట్లాడారని వారు విమర్శించారు.

సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలకు నాయకుడు కిరణ్ తేలిపోయిందని వారు నిప్పులు చెరిగారు. కెసిఆర్ వెయ్యి మెగావాట్ల సామర్థ్యం ఉందంటే ముఖ్యమంత్రి తమ ప్రసంగంలో ఆ వ్యాఖ్యలను వక్రీకరించారని టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్ ఆక్షేపించారు. రాష్ట్ర విభజన జరిగితే సమస్యలు పెరుగుతాయన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు రెండు ప్రాంతాలనూ రెచ్చగొట్టేవిగా ఉన్నాయని ఆయన అన్నారు.

English summary
Former Minister and Senior Congress MLA Komatireddy Venkat Reddy on Friday lashed out at CM Kiran Kumar Reddy for his statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X