హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఊపు మీద బిజెపి: రేపే మోడీ హైదరాబాద్ సభ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన వివాదం నేపథ్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఆదివారం బిజెపి ప్రచార రథసారథి నరేంద్ర మోడీ సభ జరగనుంది. మోడీ సభ విజయవంతం చేయడంలో బిజెపి శ్రేణులు తలమునకల య్యాయి. మోడీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షులయ్యాక ఇది మొదటి భహిరంగ సభ కావడంతో బిజెపి శ్రేణులు ప్రతిష్టాత్మ కంగా తీసుకున్నాయి. సభకు హాజరయ్యే వారికి కనీస రుసుం ఐదు రూపాయల టికెట్టు పెట్టిన విషయం తెలిసిందే.

దాదాపు లక్ష టికెట్లు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో టికెట్ల విక్రయం జోరుగా సాగుతోంది. లక్ష మందికి పైగా హాజరయ్యే అవకాశాలున్నాయని బిజెపి రాష్ర్త నాయకులు తెలిపారు. జంటనగరాల్లో ఎక్కడ చూసినా బిజెపి జెండాలు, బిజెపి జాతీయ నాయకులు, రాష్ర్త నాయకుల ప్లెక్సీలతో కాషాయమయంగా మారింది.

 Narendra Modi

స్టేడియం ఆవరణ, బయట ప్రాంతాల్లో బిజెపి జెండాలు, ప్లెక్సీలతో ముస్తాబు చేస్తున్నారు. ప్రత్యేకం గా వివిధ భంగిమల్లో ఏర్పాటు చేసిన మోడీ ప్లెక్సీలు ఆకట్టుకోనున్నాయి. స్టేడియంలో అందరికీ మోడీ ప్రసంగం వినబడేలా, కనబడేలా ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు గుజరాత్‌ నుంచి ప్రత్యేకంగా ఐటి నిపుణులను రప్పించారు.

ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను శనివారం జాతీయ నాయకులు వెంకయ్య నాయుడు, రాష్ర్త అధ్యక్షులు కిషన్‌రెడ్డి పరిశీలించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే జనాన్ని పర్యవేక్షించించేందుకు, ఇక్కడ జనాన్ని పోగు చేసేందుకు స్థానిక నాయకులకు బాధ్యతలప్పిగించారు. మోడీ ప్రసంగం పై ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. రాష్ర్త పరిస్థి తులపై మోడీ ఏ అభిప్రాయం వెలిబుచ్చుతారనేది ఆసక్తిగా మారింది.

English summary
BJP's national election campaign chief Narendra Modi will start the party's campaign for the Lok Sabha elections with a youth rally here on August 11.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X