వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ వస్తుంది, ప్రశాంతంగా ఉండండి: సోనియా

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: "తెలంగాణ వస్తుందని, ఆందోళన చెందవద్దని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. శుక్రవారం క్విట్ ఇండియా ఉద్యమం 71వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో స్వాతంత్య్ర సమరయోధులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అక్కడ తనను కలిసిన తెలంగాణకు చెందిన ఐదుగురు స్వాతంత్య్ర సమరయోధులతో సోనియా ఆ విధంగా అన్నారు.

తెలంగాణపై నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, జీవిత కాలంలో తెలంగాణ చూడాలన్న తమ కోరికని కూడా నెరవేర్చాలనిస బిల్లును త్వరగా ఆమోదించేలా చూడాలని వారు సోనియాను కోరారు. వారి అభ్యర్థనకు ఆమె సానుకులంగా ప్రతిస్పందించారు. "మీరు ప్రశాంతంగా ఉండండి. తెలంగాణ వస్తుంది. నిర్ణయం జరిగింది. అయితే, సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టకండి. వారు బాధపడకుండా చూడండి. వారితో మాటల యుద్ధానికి దిగవద్దు'' అని సూచించారు.

సోనియా నోటనే నేరుగా తెలంగాణ మాట వినడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వారు మీడియాతో పంచుకున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం 121 మంది స్వాతంత్య్రసమరయోధులకు అట్‌హోం పేరుతో రాష్ట్రపతి సన్మానించారు. మన రాష్ట్రానికి చెందిన ఐదుగురు తెలంగాణ వారికి ఈ గౌరవం దక్కింది.

నల్గొండకు చెందిన పాశం చంద్రశేఖర్ రెడ్డి, మహబూబ్‌నగర్‌కు చెందిన వెంకట్రావు, హైదరాబాద్‌కు చెందిన రాంచంద్రారెడ్డి, వరంగల్‌కు చెందిన వీరాస్వామి, ఖమ్మంకు చెందిన నాగభూషణ రావు వీరిలో ఉన్నారు. అనంతరం వీరందరికి రాష్ట్రపతి కార్యాలయం తేనీటి విందు ఇచ్చింది. ఈ విందు సందర్భంగానే సోనియా వీరిని కలుసుకున్నారు. సామాజికసేవా కార్యకర్త పాశం రాంరెడ్డి కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నారు.

English summary
AICC president Sonia Gandhi told to Telangana freedom fighters that Telangana state will be carved soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X