వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ మాటే నా మాట, జగన్‌కు బాధ లేదు: టిపై బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రయోజనాల విషయంలో తనది, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిది ఒకే వైఖరి అని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం అన్నారు. తెలంగాణ నేతలు తమ ప్రాంతం గురించి మాట్లాడితే సీమాంధ్ర ప్రాంత నేతలుగా అక్కడి ప్రజల అభిప్రాయాల గురించి తాము ఎందుకు మాట్లాడకూడదని ప్రశ్నించారు. తామిద్దరం రాష్ట్రస్థాయి నేతలమే అయినప్పటికీ సీమాంధ్ర ప్రాంత నాయకులుగా అక్కడి ప్రయోజనాల గురించి మాట్లాడక తప్పదన్నారు.

శనివారం బొత్స కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌ను ఢిల్లీలో కలుసుకుని చర్చలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రజలు ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని పరోక్షంగా తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. ఆంటోనీ కమిటీ సీమాంధ్ర ప్రజల ఆందోళనలకు తగిన పరిష్కారం కనుగొంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కమిటీని కలవాల్సిన వారి జాబితాను తాను, ముఖ్యమంత్రి కలిసి రూపొందిస్తామన్నారు. ఆంటోనీ కమిటీ విధివిధానాలగురించి చర్చించేందుకే ఢిల్లీకి వచ్చానని, మంగళవారం సాయంత్రం నుంచి ఈ కమిటీ నేతలను కలుసుకుంటుందని, కమిటీ పెద్దలు హైదరాబాద్ పర్యటన గురించి చెప్పలేనన్నారు. దాదాపు అన్ని పార్టీలు తెలంగాణ పట్ల అనుకూలంగా స్పందించినందుకే కాంగ్రెస్ కూడా విభజన అనివార్యమనే నిర్ణయం తీసుకుందని బొత్స తెలిపారు.

ఈ నేపథ్యంలో సీమాంధ్రకు నష్టం జరగకుండా చూడాలని భావిస్తున్నామని, కాంగ్రెస్ ఏ ప్రాంతానికీ నష్టం జరగకుండా చూసుకుంటుందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మల రాజీనామాలు రాజకీయ లబ్ధికోసమే తప్ప సమైక్యాంధ్రకోసం కాదన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్న బాధ వారిలో ఏ కోశానాలేదన్నారు.

English summary
PCC chief Botsa Satyanarayana on Saturday said that 
 
 Given the agitation in Seemandhra, address their 
 
 problems before division.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X