వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ కోసం విఐపిల క్యూ: నటులు, దర్శకులు కూడా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narendra Modi
హైదరాబాద్: నగరానికి వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీని పలువురు రాజకీయ, సినీ, ఉద్యమ ప్రముఖులు కలుసుకున్నారు. పార్క్ హయత్ హోటల్లో ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, బిసి సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బెల్లయ్య నాయక్ తదితరులు మోడీని కలుసుకున్నారు. బిజెపికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా కలిశారు.

తెలంగాణపై కాంగ్రెసు కుట్ర చేస్తే.. బిజెపి తప్పకుండా తెలంగాణ ఇస్తుందని ఈ సందర్భంగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. మోడీని ప్రధానిగా చూడాలని యువత ఆశగా ఎదురు చూస్తోందని అన్నారు. పార్క్ హయత్ హోటల్లో పలువురు పారిశ్రామికవేత్తలు, మేధావులు కలుసుకున్నారు. మోడీని కలిసేందుకు దాదాపు 81 మంది ప్రముఖులకు అపాయింటుమెంట్ లభించింది.

మోడీ బేగంపేట విమానాశ్రయానికి వచ్చినప్పటి నుండి మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆయన వెంట ఉన్నారు. కృష్ణం రాజు కుటుంబ సభ్యులు మోడీని ప్రత్యేకంగా కలుసుకున్నారు. సినీ ప్రముఖులు కోట శ్రీనివాస రావు, అలీ, రామ్ గోపాల్ వర్మ, వివి వినాయక్, పూరి జగన్నాథ్‌లు, మాజీ అధికారి గోపీనాథ్ రెడ్డి, గ్లోబల్ ఆసుపత్రి రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు మోడీని కలుసుకున్నారు.

నిర్మాతలు సి.కల్యాణ్, అశోక్ కుమార్, సంగీత దర్శకులు కీరవాణి, దర్శకులు రాఘవేంద్ర రావు, నటిగౌతమి, నటులు మోహన్ బాబు, దగ్గుపాటి రానా, జగపతి బాబు, నటి లక్ష్మీ ప్రసన్నలు మోడీని కలిశారు.

నిర్మాతలు రామానాయుడు, సురేష్ బాబులు కూడా మధ్యాహ్నం మోడీని కలవనున్నారు. చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తాను మోడీని కోరానని ఆర్.కృష్ణయ్య తెలిపారు. మరోవైపు మోడీని కలిసేందుకు నగరంలో స్థిరపడిన ఉత్తరాదివాసులు బారులుతీరారు. దీంతో పార్క్ హయత్ హోటల్ కిటకిటలాడుతోంది. మోడీ కోసం భారీగా బిజెపి కార్యకర్తలు రావడంతో పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో వాగ్వాదం జరిగింది.

English summary
Ram Gopal Varma, VV Vinayak, Ali, Kota Srinvias Rao, Manda Krishna Madiga, Krishnam Raju were met Gujarat CM Narendra Modi on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X