టి వెనక్కెళ్లదు: డిఎస్, విజయమ్మ దీక్ష వేదిక ఖరారు

రాష్ట్రం విడిపోయినా తెలుగు జాతిగా కలిసుందామని ఆయన పిలుపునిచ్చారు. అందరం కెలిసి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామన్నారు. ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో తెలుగు వారు ఎన్నో పదవులలో ఉన్నారని, తెలంగాణలోని సీమాంధ్ర వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా కేంద్రం సమస్యను పరిష్కరిస్తుందన్నారు. భిన్నాభిప్రాయాలు ఉన్నా తెలుగు వాళ్లంతా ఒక్కటే అన్నారు. కృష్ణా, గోదావరి జిలాల పంపకం ఆందోళన అవసరం లేదన్నారు. జలాల పంపిణీకి చట్టబద్దమైన సంస్థలు ఉన్నాయన్నారు. ఎవరి వద్ద ఉంటే వారివి అనుకోవద్దునని సూచించారు. ఐదు దశాబ్దాల్లో ఏ ఒప్పందం కూడా అమలుకు నోచుకోలేదన్నారు.
విజయమ్మ దీక్ష వేదిక ఖరారు
సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 19 నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చేపట్టనున్న ఆమరణ దీక్ష వేదిక ఖరారైంది. విజయవాడ బందరురోడ్డులోని లబ్బిపేట వద్ద విజయమ్మ దీక్షకు దిగనున్నారు.












Click it and Unblock the Notifications