బాషాకు బాబు నివాళి, ఉద్వేగం: నన్నపనేని కంటతడి
గుంటూరు: ప్రమాదంలో మృతి చెందిన పార్టీ సీనియర్ నేత లాల్ జాన్ బాషా భౌతికాయానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నివాళులు అర్పించారు. బాబు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. బాషా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చంద్రబాబు ఈ రోజు ఉదయం హైదరాబాదు నుండి విమానంలో గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో గుంటూరుకు వచ్చారు.
గుంటూరులోని బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో ఉంచిన బాషా మృతదేహానికి నివాళులు అర్పించారు. బాబుతో పాటు పార్టీ నేతలు గుంటూరుకు వచ్చారు. పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి కంట తడి పెట్టారు. బాబు బాషా కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారిని చూడగానే ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.

టిడిపి నేతలు కోడెల శివప్రసాద్, పత్తిపాటి పుల్లారావు, నన్నపనేని రాజకుమారి, యనమల రామకృష్ణుడు, గరికపాటి రామ్మోహన రావు తదితర నేతలు నివాళులు అర్పించారు.
లాల్‌జాన్ బాషాది పెద్ద కుటుంబం. ఏడుగురు సోదరులు, నలుగురు సోదరిమణుల్లో బాషా అందరికంటే పెద్ద. ఆయన సోదరుడు ఎస్ఎం జియావుద్దీన్ గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. బాషాకు భార్య, ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలున్నారు. పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications