ప్రధానిపై మోడీ విమర్శ: ఊరుకోవాలని అద్వానీ ట్విస్ట్

ప్రధాని ప్రసంగంపై మోడీ తీవ్ర విమర్శలు చేశారు. దానిపై కాంగ్రెసు పార్టీ నేతలు ధ్వజమెత్తారు. స్వాతంత్ర్య దినోత్వవం నాడు హుందాగా మెలగాలని మోడీకి సూచించారు. ప్రధానితో కాకుండా అభివృద్ధి, పాలన పైన ముందు తమతో చర్చించాలని కేంద్రమంత్రులు సల్మాన్ ఖుర్షీద్, గులాం నబీ ఆజాద్‌లు సవాల్ విసిరారు.
కాంగ్రెసు నేతలో కాకుండా అద్వానీ కూడా మోడీ విమర్శలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం. ఎవర్నీ విమర్శించకూడదు' అంటూ మోడీని ఎద్దేవా చేశారు.
తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అద్వానీ మాట్లాడుతూ.. తాను ప్రధాని ప్రసంగం విన్నానని, ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం కాబట్టి ఎవరినీ విమర్శించకుండా, భారత దేశానికి అద్భుతమైన భవిష్యత్తు ఉందనే విషయాన్ని మనమంతా గుర్తించాలని అన్నారు.












Click it and Unblock the Notifications