దీక్షకు పట్టు, బెజవాడ ఉద్రిక్తం: దేవినేని ఉమ అరెస్టు

పోలీసు స్టేషన్‌లో కూడా దేవినేని ఉమామహేశ్వర రావు దీక్ష చేస్తారని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. దేవినేని ఉమామహేశ్వరరావుకు ప్రాధాన్యం పెరుగుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని టిడిపి నేత వర్ల రామయ్య విమర్శించారు. ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించినందుకే ఉమను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
దేవినేని ఉమామహేశ్వర రావును గొల్లపూడి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరకు ఉమ దీక్ష చేస్తారని టిడిపి నాయకులు చెబుతున్నారు. అంతకు ముందు దేవినేని ఉమామహేశ్వర రావు చుట్టూ టిడిపి కార్యకర్తలు వలయంగా ఏర్పడ్డారు. ఆ వలయాన్ని ఛేదించుకుని పోలీసులు ఉమా వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, టిడిపి కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.
విజయవాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జీ కేశినేని నానితో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టిడిపి నాయకుడు బొండా ఉమామహేశ్వర రావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications