కొత్త పార్టీ లేదన్న దిగ్విజయ్, వైఎస్ విగ్రహంపై నల్లరంగు

డిగ్గీపై పితాని ఫైర్
దిగ్విజయ్ సింగ్ సీమాంధ్ర ఉద్యమకారులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి పితాని సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలో మండిపడ్డారు. ఆయన సమైక్య ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దిగ్విజయ్ వ్యాఖ్యలను తాను తమ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. పంచాయతీ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలం ఎంతో తేలిందని, అందుకే ఆ పార్టీ సమైక్య నినాదం అందుకుందని ఎద్దేవా చేశారు.
వైయస్ విగ్రహంపై నల్లరంగు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ చేస్తున్న దీక్షను నిరసిస్తూ తెలంగాణ ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్‌లో తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విజయమ్మ దీక్షను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
మానుకోటలోని దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పైన తెలంగాణవాదులు నల్లరంగు పోశారు. అక్కడే ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దిమ్మెను కూల్చి వేశారు. జెండాను తొలగించారు. హైదరాబాద్ వెళ్లాలంటే వీసా కావాలా అని నాడు వైయస్ అన్నారని, నిన్న షర్మిల హైదరాబాదును పాకిస్తాన్‌తో పోల్చారని వారు ప్లకార్డులు ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications