జగన్ రిజైన్ ఎందుకు: కెటిఆర్, ఎంపీలకి టిడిపి పాంప్లెట్స్

 KTR
హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తానని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యుడు కెటి రామారావు సోమవారం ప్రశ్నించారు. విద్యుత్ సౌధ వద్ద తెలంగాణ సద్భావన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ దీక్ష ఓ వంచన అన్నారు.

తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నేతల మాటలు నీతిమాలినవన్నారు. తిరుగుబాటు చేస్తున్న సీమాంధ్ర నేతలపా ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎందుకు వేటు వేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెసు తెలంగాణ ఇస్తుందని తెలిస్తే టిడిపి లేఖ ఇచ్చేది కాదని ఆ పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారన్నారు. తెలంగాణ వస్తే విద్యుత్ సమస్య వస్తుందన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు అవాస్తవమన్నారు.

రైతులను భయభ్రాంతులకు గురి చేసే కుట్ర అన్నారు. కేంద్రం తెలంగాణ ఇస్తామని ప్రకటించాక పది రోజులు కిరణ్ దాక్కున్నారని, తమ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ సవాళ్లపై ఇంత వరకు స్పందించలేదన్నారు. చంద్రబాబు ప్రధానికి లేఖ రాయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, కిరణ్, బాబు, జగన్‌ల నైజం బయటపడిందన్నారు. క్యాంప్ ఆఫీసులోనే కుట్రలు జరుగుతున్నాయన్నారు.

సీమాంధ్రులు కావాలనే తమను రెచ్చగొడుతున్నారన్నారు. హైదరబాదు లేని తెలంగాణను ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. హైదరాబాద్ తాత్కాలిక రాజధాని అని కేంద్రం గట్టిగా చెప్పాలన్నారు. హైదరాబాదు లేని తెలంగాణ తల లేని మొండెం వంటిదన్నారు. హైదరాబాద్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే మజ్లిస్ కూడా తమతో కలిసి ఉద్యమించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

టిడిపి ఎంపీల కరపత్రాలు

కాంగ్రెసు పార్టీ తప్పులు అంటూ సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు సోమవారం ఢిల్లీలో ఎంపీలకు కరపత్రాలు పంచి పెట్టారు. అనంతరం వారు మాట్లాడారు. సీమాంధ్రుల హక్కుల కోసం వెంటనే అఖిల పక్షం ఏర్పాటు చేయాలని, కొందరు విద్రోహుల వల్లనే రాష్ట్ర విభజనను అడ్డుకోలేకపోతున్నామని సిఎం రమేష్ ఆరోపించారు.

తమను పార్లమెంటు నుండి సస్పెండ్ చేసినా పోరాటం ఆగదని, సీమాంధ్ర ప్రజల కోసం సస్పెండ్ అయ్యామని గర్వపడతామని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు సభ్యులు సభకు ముఖం చాటేస్తున్నారని, కాంగ్రెసు ఎంపీలకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని కొణకళ్ల నారాయణ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+