బిడ్డలపై మమకారంతో ఎత్తుకెళ్లా: మేరీ మాట
గుంటూరు: బిడ్డలపై మమకారంతోనే తాను గాంధీ ఆస్పత్రి నుంచి శిశువును తీసుకుని వచ్చినట్లు మేరీ చెబుతోంది. తనకు బిడ్డలు పుట్టకుండా గర్భసంచీ తీసేశారని, దాంతో తనకు బిడ్డలు కలిగే అవకాశం లేకపోవడంతో బిడ్డలపై మమకారంతో ఎత్తుకొచ్చానని మీడియా ప్రతినిధులతో చెప్పింది. హైదరాబాద్ గాంధీ హాస్పటల్ నుండి రెండు రోజుల మగశిశువును అపహరించిన విషయం తెలిసిందే.
శిశువును అపహరించిన ఇద్దరిని ఆదివారం గుంటూరు జిల్లా తెనాలి డిఎస్పీ వై తులసీరాం ప్రసాద్ సూచనల మేరకు తెనాలి త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్రీటౌన్ సిఐ మెహబూబ్ బాషా ఇచ్చిన సమాచారం మేరకు- గాంధీ హాస్పటల్లో బాబును కిడ్నాప్ చేసిన ఇద్దరు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నట్లుగా చిలకలగూడ పోలీసులు అందించిన సమాచారం మేరకు సిఐ మెహబూబ్ బాషా పోలీస్ సిబ్బంది రైల్వే స్టేషన్‌కు చేరుకుని, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు స్టేషన్‌కు రాగానే తనిఖీలు నిర్వహించారు.

డి1 కోచ్‌లో గెడ్డం మేరీ, నవీన్ వద్ద ఉన్న మగ శిశువు కిడ్నాప్‌కు గురైన శిశువుగా గుర్తించిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకుని, బాబును వైద్య సేవల నిమిత్తం హెల్త్ హాస్పటల్‌కు తరలించారు. మేరీ ఆలియాస్ బుజ్జమ్మ, ఆమెతో ఉన్న యువకుడు నవీన్ తన అక్క కొడుకుగా చెబుతోంది. వీరు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందినవారని పోలీస్ దర్యాప్తులో వెల్లడైంది. బాబును, కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న విషయం చిలకలగూడ పోలీసులకు సమాచారం ఇచ్చామని సిఐ తెలిపారు.
శిశువును అపహరించిన మరియమ్మ అలియాస్ మేరీ, ఆమె మేనల్లుడు నవీన్ పశ్చిమ గోదావరి జిలలా పాలకొల్లుకు చెందినవారు. అపహరణకు గురైన శిశువు మనోహర్, సుమిత్ర దంపతులకు జన్మించాడు. మనోహర్, నవీన్ ఆస్పత్రిలో ఒకే చోట పడుకున్నారు. తెల్లారి ఉదయం 6 గంటలకు మనోహర్ లేచే సరికి నవీన్ కనిపించలేదు. మేరీ, తన శిశువు కూడా కనిపించలేదు.












Click it and Unblock the Notifications