వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బానిసలం కాదు: మహీధర్, రాసిస్తే పరిశీలిస్తామని డిగ్గీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

 I am not slave: Seemandhra leader
హైదరాబాద్/న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రజాప్రతినిధులం ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌కు బానిసలం కామని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మంత్రి మహీధర్ రెడ్డి సోమవారం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు పార్టీ లైన్ దాటవద్దని దిగ్విజయ్ సింగ్ చేసిన హెచ్చరికలపై ఆయన స్పందించారు. తాము ఆయనకు బానిసలం కాదన్నారు. ఆయన సచివాలయానికి వచ్చినప్పుడు సీమాంధ్ర ఉద్యోగులు ఆయనను అడ్డుకున్నారు. ఈ సమయంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

రాసిస్తే పరిశీలిస్తామన్న డిగ్గీ

రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితిపై ఈ నెల 30లోగా తేల్చాలని అధిష్ఠానానికి అల్టిమేటమ్ ఇవ్వాలని సీమాంధ్ర మంత్రులు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సీమాంధ్రకు చెందిన 9 మంది కేంద్ర మంత్రులు పార్లమెంట్ అనుబంధ భవనంలో సోమవారం భేటీ అయ్యి, పరిస్థితిని సమీక్షించారు. ఆంటోనీ కమిటీ సభ్యులు వారితో మరోసారి భేటీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ బుధవారం తర్వాతే వారిని కలుసుకోవాలని మంత్రులు నిర్ణయించారు.

రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని వారు నిర్ణయించారు. హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి, తెలంగాణ, సీమాంధ్రలకు వేర్వేరు రాజధానులు ఏర్పాటుచేయాలన్న కావూరి నిర్ణయం సహేతుకంగా ఉన్నదని, దీని వల్ల ఎవరికీ నష్టం జరగదని వారు భావించారు. ఈ అనిశ్చిత పరిస్థితి ఎక్కువకాలం సాగకుండా 30 లోగా నిర్ణయం తీసుకోవాలని కోరాలని వారు నిర్ణయించుకున్నారు.

కాగా, మంత్రుల అల్టిమేటమ్ తమకు చేరలేదని, వారు లిఖితపూర్వకంగా తమకు ఏమైనా ఇస్తే పరిశీలిస్తామని దిగ్విజయ్ సింగ్ విలేకరులకు చెప్పారు. మరోవైపు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు సమావేశమై ఆహార భద్రత బిల్లు విషయంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించనున్నట్లు తెలిసింది.

English summary
Municipal minister Maheedhar Reddy on Monday made a sensational comment that Congress leaders from Seemandhra regions ae not slaves of Party incharge Digvijay Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X