వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సభలో కొట్టుకున్న ఎంపి, పత్రికతో విజయమ్మ(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్/గుంటూరు: విభజన మంటలు ఢిల్లీ నుండి గల్లీ వరకు 23వ రోజు కూడా కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజనను, విభజన తీరును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర కాంగ్రెసు, టిడిపి ఎంపీలు లోకసభలో నిరసన తెలిపారు. టిడిపి సభ్యులు వెల్ లోకి దూసుకుపోయారు. దీంతో కేంద్రమంత్రి కమల్ నాథ్ పదకొండు మంది ఎంపీలపై సస్పెన్షన్ తీర్మానం ప్రవేశ పెట్టారు. బిజెపి వ్యతిరేకించడంతో నిర్ణయం వాయిదా పడింది.

విభజన తీరును నిరసిస్తూ టిడిపి ఎంపి శివ ప్రసాద్ కొరడాతో కొట్టుకొని నిరసన తెలిపారు. లోకసభలో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ రావు సభలో లేకున్నా ఆయన పేరును చదివారు. సభకు బొత్స ఝాన్సీ సస్పెన్షన్ తీర్మానం ప్రవేశ పెట్టిన తర్వాత రాగా, తీర్మానానికి కొద్దిసేపటికి ముందు కనుమూరి బాపిరాజు బయటకు వెళ్లారు. విభజనపై ఢిల్లీలో జోరుగా మంతనాలు సాగుతున్నాయి.

సమన్యాయం చేయాలని లేదంటే రాష్ట్రాన్ని యథావిథంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ దీక్ష మూడో రోజు కొనసాగుతోంది. ఈ రోజు దీక్షలో షర్మిల పాల్గొన్నారు.

శివ ప్రసాద్

శివ ప్రసాద్

విభజన తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు సభ్యుడు శివ ప్రసాద్ తనను తాను కొరడాతో కొట్టుకొని నిరసన తెలిపారు. ఆయన సభలో, విలేకరుల సమావేశంలో కొరడాతో కొట్టుకున్నారు.

జైపాల్‌తో ఝాన్సీ

జైపాల్‌తో ఝాన్సీ

పార్లమెంటు ప్రాంగణంలో కేంద్రమంత్రి జైపాల్ రెడ్డితో మాట్లాడుతున్న పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సతీమణి, ఎంపి బొత్స ఝాన్సీ మాట్లాడుతున్న దృశ్యం.

ఎంపీలు

ఎంపీలు

పార్లమెంటు ఆవరణలో కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు. టిడిపి, కాంగ్రెసు ఎంపీలపై కేంద్రమంత్రి కమల్ నాథ్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఎంపి కనుమూరి బాపిరాజు తీర్మానానికి ముందే సభ నుండి బయటకు వెళ్లారు.

టి ఎంపీలు

టి ఎంపీలు

కాంగ్రెసు పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు పార్లమెంటు ఆవరణలో ఉన్న దృశ్యం.

పత్రిక చదువుతున్న విజయమ్మ

పత్రిక చదువుతున్న విజయమ్మ

రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ గుంటూరులో ఆమరణ దీక్షకు దిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ దీక్ష కొనసాగుతోంది. ఆమె దీక్షా ప్రాంగణంలో పత్రిక చదువుతున్న దృశ్యం.

దీక్షలో భారతి, షర్మిల

దీక్షలో భారతి, షర్మిల

రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ గుంటూరులో ఆమరణ దీక్షకు దిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ దీక్షలో గురువారం వైయస్ భారతి, షర్మిలలు పాల్గొన్నారు.

English summary
Seemandhra MPs (seven Congress and four TDP) were suspended from the Lok Sabha on Thursday for causing disruptions in the House over the bifurcation of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X