వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరికృష్ణ రాజీనామా: బాబుపై ఒత్తిడికోసమా, పార్టీయా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nandamuri Hakrishna
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎంపి నందమూరి హరికృష్ణ గురువారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. విభజనపై కాంగ్రెసు పార్టీ తీరును నిరసిస్తూ ఆయన ఇటీవలే రాజీనామా చేశారు. ఈసారి ఆయన తన రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్‌కు స్పీకర్ ఫార్మాట్‌లో ఇచ్చారు. సమైక్యాంధ్రకు హరి జై కొట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని యథావిథిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఆయన రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడారు. తాను సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేసినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. అన్నగారి ఆశయ సాధన కోసమే రాజీనామా చేశానని చెప్పారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు వల్లనే తనకు ఈ పదవి దక్కిందని, తనను రాజ్యసభ సభ్యునిగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రజల్లోకి వెళతానని, వారి పక్షాన నిలబడతానన్నారు.

పార్టీ కోసమా.. బాబుపై ఒత్తిడి కోసమా?

హరికృష్ణ రాజీనామా పైన వివిధ రకాల ప్రచారం జరుగుతోంది. సిడబ్ల్యూసి విభజన నిర్ణయం వెలువడిన హరికృష్ణ మొదట రాజీనామా చేస్తూ... ప్రజల సెంటిమెంటుకు తలవంచి తాను విభజనను అంగీకరిస్తున్నానన అయితే, విభజన తీరు బాగాలేదని ఆయన ఆక్షేపించారు. ఈసారి సమైక్యాంద్రకు మద్దతుగా ఆయన రాజీనామా చేశారు. అయితే హరికృష్ణ రాజీనామాలో మరో కోణాలు కూడా ఉండి ఉండవచ్చునని ప్రచారం సాగుతోంది.

చంద్రబాబుపై నిత్యం అసంతృప్తి వ్యక్తం చేసే హరికృష్ణ సీమాంధ్రలో కొత్త పార్టీ పెట్టే ఉద్దేశ్యంతో ఉన్నారని అందుకే, రాజీనామా చేశారని అంటున్నారు. త్వరలో ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే, గతంలో అన్న టిడిపి అనుభవంతో ఆయన ఆ వైపు మొగ్గు చూపకపోతారని కొందరు చెబుతుండగా, జూనియర్ ఎన్టీఆర్ కారణంగా పార్టీ వైపు ఆలోచించే అవకాశాలు లేకపోలేదని మరికొందరు అంటున్నారు.

హరికృష్ణ రాజ్యసభ పదవి మరో ఆరు నెలల్లో ముగుస్తుంది. దీంతో మరోసారి పదవి కోసం ఇప్పటి నుండే అధినేత నారా చంద్రబాబు నాయుడు పైన ఒత్తిడి పెంచే వ్యూహం కావొచ్చునని కూడా అనుమానిస్తున్నారు. ఆయన పదవి ఏప్రిల్‌లో ముగుస్తుంది.

English summary
Telugudesam senior leader MP Nandamuri Hakrishna resigned for his Rajya Sabha on Thursday. He was sent his resignation letter by FAX.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X