వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ అబద్దాలు: కోదండరాం, విభజనపై హైకోర్టులో పిల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ గురువారం ఆరోపించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదు పైన పెత్తనం కోసమే సమైక్యాంధ్ర ఉద్యమం నడిపిస్తున్నారని విమర్శించారు.

సెప్టెంబర్ 4 నుంచి 7వ తేదిలోగా చలో హైదరాబాద్ పేరుతో మహాశాంతి ర్యాలీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి, నక్సల్స్ సమస్యకు సంబంధం లేదన్నారు. విభజన జరిగితే నక్సల్స్ సమస్య తగ్గుతుందని చెప్పారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం తెలంగాణ ప్రాంతానికి చెందినదేనని ఆయన చెప్పారు.

ఢిల్లీకి వెళ్తాం: అశోక్ బాబు

ఈ నెల 26, 27, 28 తేదీలలో తాము ఢిల్లీ వెళ్లి జాతీయ పార్టీ నేతలను కలుస్తామని ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. వారు ఈ రోజు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ నాయకులందర్నీ కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరేందుకు ఢిల్లీ వెళ్తామన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. కిరణ్‌తో భేటీలో సమ్మె విషయం చర్చకు రాలేదని చెప్పారు.

డ్రామాలు కట్టి పెట్టండి: పరకాల

సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు డ్రామాలు కట్టిపెట్టి తమ పదవులకు రాజీనామాలు చేసి, సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్ పశ్చిమ గోదావరి జిల్లాలో డిమాండ్ చేశారు. సిడబ్ల్యూసి తన నిర్ణయాన్ని 30వ తేదిలోగా వెనక్కి తీసుకోవాలని, లేదంటే సమ్మెకు దిగుతామని విద్యుద్ ఉద్యోగులు హెచ్చరించారు. దక్షిణాది అంధకారమైతే కాంగ్రెసు పార్టీయే బాధ్యత వహించాలన్నారు.

రహస్య ఒప్పందం లేకుంటే చెప్పండి: పయ్యావుల

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య రహస్య ఒప్పందం లేకుంటే భవిష్యత్తులో తాము కాంగ్రెసు పార్టీతో కలవమని వైయస్ జగన్ చెప్పగలరా అని టిడిపి నేత పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. విభజనతో సీమాంధ్ర విద్యార్థులను నిరుద్యోగులను చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి ప్రధాని పదవి కట్టబెట్టేందుకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. సమైక్యాంధ్ర కోసం టిడిపి నేతల ఆందోళనల్లో చిత్తశుద్ధి లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

విభజనపై హైకోర్టులో పిల్

రాష్ట్ర విభజనపై స్పష్టత ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తి దీనిని దాఖలు చేశారు.

టెట్ వాయిదా

ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ వాయిదా పడింది. రాష్ట్రంలోని ఆందోళనల నేపథ్యంలో సెప్టెంబర్ 1న జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామన్నారు.

బిజెపిపై పొన్నం ఫైర్

తెలంగాణ ఎంపీలు సస్పెండ్ అయినప్పుడు మాట్లాడని ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ సీమాంధ్ర ఎంపీలు సస్పెండ్ అయినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ఎంపి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. తెలంగాణ రావటం ఆ పార్టీకి ఇష్టం లేదా చెప్పాలన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి ప్రభుత్వ మద్దతుందని టిఎన్జీవో ఆరోపించింది. సీమాంధ్ర ఉద్యోగుల సమస్యలపై తాము చర్చకు సిద్ధమని, ఆందోళనలతో రెచ్చగొట్టవద్దని కోరారు.

కెవిపి ఇంట్లో భేటీ

ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు ఇంట్లో సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు భేటీ కానున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తారు.

English summary

 Telangana JAC chairman Kodandaram on Thursday blamed that CM Kiran Kumar Reddy is saying lies on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X