విభజన పెద్ద పొరపాటు, ఏం చేసినా తగ్గేదిలేదు: అనంత

తమను సస్పెన్షన్ చేస్తామంటే ఏ పార్టీ ఒప్పుకోలేదని చెప్పారు. తమకు కావాల్సింది కమిటీలు కాదని, విభజన వెనక్కి తీసుకునే స్పష్టమైన ప్రకటన అన్నారు. ఏం చేసినా సీమాంధ్రలో ఉద్యమాలు తగ్గయని, తాము కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. సభలో, బయట ఆందోళన కొనసాగిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేవలం సభలోనే హడావుడి చేస్తున్నారని విమర్శించారు.
తమ రాజీనామాలు స్పీకర్ ఫార్మాట్లోనే ఉన్నాయని, ఏం చేసినా తమ ఆందోళన మాత్రం కొనసాగుతుందన్నారు. విభజన ప్రకటన ఉపసంహరించుకునే వరకు ఆందోళన చేస్తామన్నారు. తమపై సస్పెన్షన్ తీర్మానాన్ని ఏ పార్టీ ఆమోదించలేదని, అలాంటి వాటికి భయపడమని చెప్పారు. తమకు అన్ని పార్టీల మద్దతుందన్నారు. కాగా, సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ వేటును ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ఖండించిన విషయం తెలిసిందే.
మనోభావాలు దెబ్బతిన్నాయి: పితాని
సిడబ్ల్యూసి నిర్ణయం తర్వాత తమ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని మంత్రి పితాని సత్యనారాయణ చిత్తూరు జిల్లా తిరుపతిలో అన్నారు. విభజనతో రెండు ప్రాంతాలకు నష్టమేనన్నారు. తమ పార్టీ అధిష్టానం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తమిళనాడు గవర్నర్ రోశయ్య భేటీ అయ్యారు.
ఎపిఎన్జీవోపై దేవి ప్రసాద్ ఫైర్
ఓ రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయానికి సమ్మె చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని టిఎన్జీవో నేత దేవి ప్రసాద్ ఎపిఎన్జీవోల సమ్మెను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ ఉద్యమం అరవై ఏల్లుగా సాగుతుందని, దీనిపై వెర్రి మాటలు మాట్లాడవద్దన్నారు. కలిసుండాలంటూనే తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మొత్తం ఐదున్నర లక్షల మంది ఉద్యోగులు ఉంటే నాలుగు లక్షల మంది ఎలా సమ్మెలో పాల్గొంటున్నారని ప్రశ్నించారు. దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.












Click it and Unblock the Notifications