ఫుడ్‌‌బిల్లు ఎన్టీఆర్‌ది, నాపై మొరుగుతున్నారు: హరికృష్ణ

Nandamuri Harikrishna
హైదరాబాద్: ఆహార భద్రత బిల్లు తన తండ్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు మానస పుత్రిక అని మాజీ రాజ్యసభ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి హరికృష్ణ మంగళవారం అన్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో ఆహార భద్రత బిల్లు గురించి ప్రస్తావించారన్నారు.

రెండు రూపాయలకు కిలో బియ్యం ఇంచి పేదల కడుపును నింపింది ఎన్టీఆరే అన్నారు. తాను తెలుగుదేశం పార్టీని వీడుతానని కొందరు మొరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చిల్లర మాటలకు తాను స్పందించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని అన్నారు.

మైలురాయి: బొత్స

ఆహార భద్రత చట్టం దేశంలోనే మైలురాయి అని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం గాంధీ భవనంలో అన్నారు. ఈ బిల్లు పేదలకు ఓ వరమని, బిల్లు తెచ్చిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి అభినందనలు అన్నారు. తన ఆరోగ్యం బాగా లేకున్నా పేదల బిల్లు కోసం సోనియా సభకు వచ్చారన్నారు.

దివంగత ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు ఇచ్చిన స్ఫూర్తితో కాంగ్రెసు పార్టీ మాట నిలబెట్టుకుందన్నారు. కాంగ్రెసు పేదల పక్షపాతి అన్నారు. కొందరు నేతలు ఆత్మస్థైర్యం లేకనే కాంగ్రెసు పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+