తుమ్మల వాహనంపై కాల్పులు: మాణిక్ రెడ్డిపై దాడి

Tummala Nageswar Rao
సంగారెడ్డి: రాష్ట్ర రాజధాని హైదరాబాదు శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పులు సంచలనం సృష్టించాయి. తెలుగుదేశం పార్టీ నాయకుడు, శాసనసభ్యుడు తుమ్మల నాగేశ్వరరావు, మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పొలిట్ బ్యూరో సభ్యుడు మాణిక్ రెడ్డి వాహనాలపై కొద్దిసేపటి తేడాలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

మంగళవారం రాత్రి మెదక్ జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరు శివారుల్లో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. డివైడర్ మధ్యలో ఉన్న చెట్ల చాటు నుంచి దుండగులు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. మెదక్ జిల్లా జోగిపేటలో పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ముగించుకుని మాణిక్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డుపై హైదరాబాద్‌కి బయలుదేరారు.

కొల్లూరు శివార్లలోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తులు వాహనంపై దాడి చేయగా, అద్దాలు ధ్వంసమయ్యాయి. మాణిక్ రెడ్డి వాహనాన్ని నిలిపివేసి చూడగా, ఎవరూ కనిపించలేదు. హైదరాబాద్ చేరుకున్న తరువాత ఆయన ఈ విషయాన్ని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు ఫోన్ ద్వారా తెలిపారు. తనకు శత్రువులు ఎవరూ లేరని, తన వాహనంపై ఎవరు, ఎందుకు కాల్పులు జరిపారో అర్థం కావడంలేదని మాణిక్ రెడ్డి తెలిపారు.

ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే... అదే ప్రాంతంలో కొంపల్లి నుంచి హైదరాబాద్‌లోని తన నివాసానికి వస్తున్న తుమ్మల నాగేశ్వరరావు వాహనంపైనా దాడి జరిగింది. వాహనంలో తుమ్మల డ్రైవరు పక్క సీటులో కూర్చున్నారు. వెనుక సీటులో పీఏ తిలక్, తుమ్మల అనుచరుడు నాగేశ్వరరావు ఉన్నారు. కిటికీ అద్దాలు పగిలి తిలక్, నాగేశ్వరరావు స్వల్పంగా గాయపడ్డారు.

ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్డులో మాణిక్ రెడ్డి వాహనంపైనా దాడి జరిగిన విషయం టీవీల ద్వారా తుమ్మల నాగేశ్వరరావుకు తెలిసింది. దీంతో అనుమానం బలపడి తమ వాహనాన్ని మరింతగా పరీక్షించారు. వాహనం డోర్ మీద బుల్లెట్ తగిలిన గుర్తును గమనించారు. దీనిపై తుమ్మల పీఏ తిలక్ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి సమయంలో తుమ్మల అంగరక్షకులు కూడా వాహనంలో లేనట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+