కెసిఆర్, కోదండవాదాన్ని బాబు వినిపిస్తారు: అంబటి

రాష్ట్ర విభజనపై సిడబ్ల్యుసి నుంచి నిర్ణయం వెలువడగానే దానికి అంగీకరిస్తూ చంద్రబాబు సీమాంధ్రలో రాజధాని ఏర్పాటు నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆయన గుర్తు చేశారు. సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవానికి చంద్రబాబు నాలుగైదు లక్షల కోట్ల రూపాయలకు ఖరీదు కట్టారని ఆయన అన్నారు. తమ నాయకురాలు వైయస్ షర్మిల బస్సు యాత్ర తలపెట్టగానే చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర పేరుతో బస్సు యాత్రను తలపెట్టారని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి లేకపోవడం వల్లనే రాష్ట్రాన్ని విభజించడానికి సాహసం చేశారని ఆయన విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఉండి ఉంటే రాష్ట్రాన్ని చీల్చే సాహసం చేసి ఉండేవారు కాదని ఆయన అన్నారు. వైయస్ లేకపోవడం వల్లనే రాష్ట్రం అతలాకుతలం అవుతోందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విభజించాలనేవారి సంఖ్య తగ్గుతూ వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి నాలుగో వర్ధంతిని ఘనంగా జరపాలని ఆయన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు.
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించకూడదని డిమాండ్ చేస్తూ చిత్తశుద్ధితో, నిజాయితీతో ఆందోళన చేస్తున్న పార్టీ తమది ఒక్కటేనని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని విభజించడానికి సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసి తమ పార్టీకి చెందిన 16 మంది శాసనసభ్యులు రాజీనామా చేశారని ఆయన చెప్పారు. తమ పార్టీ నేత వైయస్ విజయమ్మ ఆమరణ నిరాహార దీక్ష చేశారని చెప్పారు. ప్రస్తుతం తమ పార్టీ నేత వైయస్ జగన్ దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీని అనుసరించాల్సిన అవసరం తమకు లేదని, అడ్డగోలు విభజన కూడదని చెప్పే చిత్తశుద్ధి, నిజాయితీ తమకు మాత్రమే ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications