కిరణ్‌పై దామోదర ఫైర్, బాబుకు వద్దని చెప్పామని కేశవ్

2004లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి కానీ, ప్రజల మనోభావాలను గౌరవించరా అని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమే అన్నారు.
సోనియా స్పందించడం లేదు: శివప్రసాద్
విభజన నిర్ణయం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతోందని అయినా, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించడం లేదని టిడిపి చిత్తూరు ఎంపి శివ ప్రసాద్ అన్నారు. సీమాంధ్రలో ఏరియల్ సర్వే చేస్తే పరిస్థితి అర్థమవుతోందన్నారు. విభజనను ఆపి రాష్ట్రానికి న్యాయం చేయాలన్నారు.
బాబు యాత్రపై పయ్యావుల
సీమాంధ్రలో యాత్ర చేపట్టేందుకు ఇది సరైన సమయం కాదని తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తాము చెప్పిన విషయం వాస్తవమేనని టిడిపి సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. తాము యాత్రను తప్పు పట్టడం లేదని, క్షేత్రస్థాయిలోని పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరామన్నారు. తెలుగుదేశం పార్టీని నష్టపరిచేందుకే కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తోందన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్రలో తమ పార్టీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీ టిడిపిని దెబ్బతీసేందుకు బాబు యాత్రలో గందరగోళం సృష్టించేందుకు ఎంతకైనా తెగిస్తుందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార పార్టీకి మద్దతు పలుకుతుందన్నారు.












Click it and Unblock the Notifications