ఆనంద కిరణం: సిఎం చంకలో చిన్నికృష్ణుడు(పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన తెలుగు భాషా దినోత్సవంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాసేపు చిన్ని కృష్ణుడిని ఎత్తుకొని ఆడించారు. గిడుగు రామ్మూర్తి 150వ జయంతి సందర్భంగా గురువారం ఈ వేడుకలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దేశ భాషలందు తెలుగు లెస్స.. తెలుగు వెలిగిన నాడే జాతి వెలుగుతుంది.. అంటూ మాటలు, మాటలతో వైభవంగా కార్యక్రమం జరిగింది. తెలుగు ఉట్టిపడేలా పాటలు ఆలపించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రముఖులకు గిడుగు రామ్మూర్తి పురస్కారాలను ముఖ్యమంత్రి అందజేశారు. కృష్ణుడి వేషధారణలో ఉన్న ఓ చిన్నారిని కిరణ్ ఎత్తుకొని కాసేపు ఆడించారు.

చిన్ని కృష్ణుడితో కిరణ్
రవీంద్ర భారతిలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. చిన్ని కృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారిని ఎత్తుకున్న దృశ్యం.

జ్యోతి ప్రజ్వలన
రవీంద్ర భారతిలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం.

కార్యక్రమంలో కిరణ్
గిడుగు రామ్మూర్తి 150వ జయంతి సందర్భంగా జరిగిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు.

మాట్లాడుతున్న కిరణ్
హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

హాజరైన వారు
గిడుగు రామ్మూర్తి 150వ జయంతి సందర్భంగా హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమానికి హాజరైన వారు.

కిరణ్ - మండలి
హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ తదితరులు.

గిడుగుపై పుస్తకం
గిడుగు రామ్మూర్తి 150వ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో పుస్తకం విడుదల చేస్తున్న దృశ్యం.

కిరణ్ మాటా ముచ్చట
హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో మండలి బుద్ద ప్రసాద్ తదితరులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

పురస్కారం
గిడుగు రామ్మూర్తి 150వ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని పలువురు ప్రముఖులకు గిడుగు రామ్మూర్తి పురస్కారాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందజేశారు.

పురస్కారం 2
గిడుగు రామ్మూర్తి 150వ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని పలువురు ప్రముఖులకు గిడుగు రామ్మూర్తి పురస్కారాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందజేశారు.

కిరణ్ చేతిలో చిన్ని కృష్ణుడు
రవీంద్ర భారతిలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. చిన్ని కృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారిని ఎత్తుకున్న దృశ్యం.

చిన్నికృష్ణుడిని ఎత్తుకున్న కిరణ్
రవీంద్ర భారతిలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. చిన్ని కృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారిని ఎత్తుకుని కాసేపు ఆడించారు.












Click it and Unblock the Notifications