సురేఖకి కాంగ్ గ్రీన్‌సిగ్నల్: ముహూర్తంకోసం వెయిటింగ్!

తెలంగాణపై ఆ పార్టీ వైఖరిని నిరసిస్తూ కొండా దంపతులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత వారు భారతీయ జనతా పార్టీ వైపు, కాంగ్రెసు వైపు, తెలంగాణ రాష్ట్ర సమితి వైపు వెళ్లవచ్చుననే ఊహాగానాలు వినిపించాయి.
ఇప్పటి వరకు తాము ఏ పార్టీలో చేరుతామనే విషయం వారు ప్రకటించలేదు. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి వారికి గ్రీన్ సిగ్నల్ లభించడంతో పార్టీలో చేరేందుకు ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారట. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌ను కలిసిన కొండా దంపతులు ఇటీవలె పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరి సమక్షంలో పార్టీలో చేరాలనే దానిపై కొండా వర్గీయుల్లో చర్చ సాగుతోందట. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అనారోగ్యంతో ఉండటంతో కొండా దంపతులకు అపాయింట్‌మెంట్ లభించడం లేదని సమాచారం. సెప్టెంబర్ మొదటి వారంలో సోనియాను కలిసిన అనంతరం ఒకటిరెండు రోజుల్లో పరకాల నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కొండా వర్గీయులు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications