సెక్రటరియేట్లో సైలెంట్, ఎపి భవన్ వద్ద బ్యానర్స్(పిక్చర్స్)
హైదరాబాద్/న్యూఢిల్లీ: విభజనపై సిడబ్ల్యూసి నిర్ణయం నేపథ్యంలో సీమాంద్రలో ఆందోళనలు, తెలంగాణలో పార్లమెంటులో బిల్లు పెట్టాలని శాంతి ర్యాలీలు కొనసాగుతుండగా.. దేశ రాజధాని ఢిల్లీలోని ఎపి భవన్‌లో సమైక్యాంధ్రకు, తెలంగాణకు అనుకూలంగా పలు బ్యానర్‌లు వెలిశాయి.
సీమాంధ్రలోని పలు జిల్లాల్లో సమైక్యవాదాలు వివిధ రూపాల్లో 31వ రోజు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమం రోజు రోజుకు ఊపందుకుంటోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శతసహస్ర సమైక్య గళార్చన చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా టిడిపి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు పాదయాత్ర చేపట్టారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా విజయనగరంలో లక్ష గళా సింహగర్జన, సమైక్య సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీగా సమైక్యవాదులు, ఉద్యోగులు ఈ గర్జనలో పాల్గొన్నారు. హైదరాబాదులోని సచివాలయంలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు శుక్రవారం కూడా విధులు బహిష్కరించి నినాదాలు చేశారు.

ఎపి భవన్ వద్ద బ్యానర్ 1
విభజనపై సిడబ్ల్యూసి నిర్ణయం నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎపి భవన్ వద్ద తెలంగాణకు, సమైక్యాంధ్రకు అనుకూలంగా బ్యానర్స్.

ఎపి భవన్ వద్ద బ్యానర్ 2
విభజనపై సిడబ్ల్యూసి నిర్ణయం నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎపి భవన్ వద్ద తెలంగాణకు, సమైక్యాంధ్రకు అనుకూలంగా బ్యానర్స్.

ఎపి భవన్ వద్ద బ్యానర్ 3
విభజనపై సిడబ్ల్యూసి నిర్ణయం నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎపి భవన్ వద్ద తెలంగాణకు అనుకూలంగా పోస్టర్లు. సమైక్యాంధ్ర విఫలమైన నేపథ్యంలో రాష్ట్రాన్ని విభజించాలంటూ పోస్టర్.

వైయస్సార్ కాంగ్రెసు
విభజనపై కాంగ్రెసు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా దృశ్యం.

ఆసనాలతో నిరసన
విభజనపై కాంగ్రెసు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆసనాలు చేస్తూ నిరసన తెలుపుతున్న సమైక్యవాదులు.

కృష్ణాష్టమి రోజు
నెల రోజులుగా సమైక్య, తెలంగాణ నినాదాలతో దద్దరిల్లుతున్న సచివాలయం కృష్ణాష్టమి రోజున చల్లబడింది. రెండు రోజుల క్రితం సచివాలయ దృశ్యం.

జై సమైక్యాంధ్ర
చిత్తూరు జిల్లా తిరుపతిలో రోడ్డు పైన పెద్ద పెద్ద అక్షరాలతో జై సమైక్యాంధ్ర అంటూ రాసి, విభజనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న సమైక్యవాదులు.

తెలుగుతల్లి
చిత్తూరు జిల్లా తిరుపతిలో కాంగ్రెసు పార్టీ విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు తల్లికి పాలతో అభిషేకం చేస్తున్న సమైక్యవాదులు.

వైయస్సార్ కాంగ్రెసు
కాంగ్రెసు పార్టీ విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లా తిరుపతిలో నీళ్లలో నిరసన తెలుపుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు.












Click it and Unblock the Notifications