టిపై వెనక్కి తగ్గారని ఆనం: బాబు, షర్మిలపై రాళ్లని జెసి

ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే జాలేస్తోందన్నారు. తెలుగు తల్లి కన్నీరు పెడుతోందన్నారు. ప్రాణాలకు తెగించి పోరాడిన కుటుంబం నుండి తాను వచ్చానన్నారు. సీమాంధ్రలో ప్రజా ఉద్యమం జరుగుతుందని, రాజకీయ ఉద్యమం కాదన్నారు. ఇది సమైక్యవాదుల ఉద్యమమన్నారు.
సమైక్య ఉద్యమం చేస్తున్న వారు రాజకీయ పార్టీలను నమ్మవద్దన్నారు. ఎవరు పిలిచాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిలలు యాత్రలు చేసేందుకు సిద్ధమయ్యారని ప్రశ్నించారు. ఇచ్చిన లేఖలు వెనక్కి తీసుకున్న తర్వాత వారు యాత్రలు చేపట్టాలన్ారు.
సీమాంధ్రలో ఉద్యమం పార్టీల పరిధిలో లేదన్నారు. చంద్రబాబును ఆత్మగౌరవ యాత్ర చేయమని ఎవరు అడగలేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీవి సిగ్గులేని యాత్రలని మండిపడ్డారు. ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాది అని నిప్పులు చెరిగారు.
రాళ్లతో కొడతారు: జెసి
విభజన విషయంలో అన్ని పార్టీలు తప్పు చేశాయని, తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినందుకు టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు మొదట క్షమాపణ చెప్పి ఆ తర్వాత యాత్రలు చేపట్టాలన్నారు. లేదంటే సీమాంధ్రలో ప్రజలు రాళ్లతో కొడతారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని తాము పదే పదే కోరుతున్నామన్నారు. అయినా మొండిగా వ్యవహరిస్తుండటంతో ముఖ్యమంత్రి తన ఆవేదన వెళ్లగక్కారన్నారు.












Click it and Unblock the Notifications