'వైయస్‌పై విజయమ్మతో నేనలా అనలేదన్న ప్రధాని!'

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు అడిగినా ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వటం లేదు? వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు పదే పదే ఎందుకు ఇస్తున్నారని అడిగామని తెలిపారు. అలాగే, వైయస్ పైన చేసిన కామెంట్స్ గురించి అడిగితే.. తాను అలా అనలేదని, ఆయన ఆధ్వర్యంలోనే 40 మంది ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చారు కదా? మరి ఇప్పుడేంటి ఇలా? అని మాత్రమే తాను ప్రశ్నించానని ప్రధాని వివరించారని చెప్పారు.
తమ సంఖ్యాబలం తక్కువే అయినా తెలంగాణ విషయంలో కేంద్రాన్ని నిలువరిస్తామని, ఆ నమ్మకం తమకుందని వారు ధీమా వ్యక్తం చేశారు. మంచి చెడ్డల సంగతి తర్వాతని, తొలుత రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలన్నదే తమ డిమాండ్ అని అన్నారు. అసలు ఏం చేయాలనేది కాంగ్రెస్‌కే స్పష్టత లేదని సుజనా చౌదరి విమర్శించారు. తాము మొదటి నుంచీ తెలుగు ప్రజల కోసమే పోరాడుతున్నామని, హైదరాబాద్ జీవనాధారమని, దానిపై అందరూ కూర్చుని సామరస్యంగా మాట్లాడుకోవాల్సి ఉందని చెప్పారు.
తెలంగాణ ఏర్పడితే ఏమిటి? ఏర్పడకపోతే ఏమిటి? అన్నది శ్రీకృష్ణ కమిటీలో స్పష్టంగా పేర్కొన్నారని, దానిని కేంద్రం పట్టించుకోలేదని, కనీసం ప్రజాస్వామ్యబద్ధంగా కూడా వ్యవహరించటం లేదని విమర్శించారు. మరో పది, పదిహేను రోజుల్లో ఉద్యమం ఆగిపోతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారని, సీమాంధ్ర ఉద్యమంపై కాంగ్రెస్ తీరు చాలా దారుణంగా ఉందని చెప్పారు. ఉద్యోగాలు, అన్నపానీయాలూ మాని ఉద్యమిస్తోంటే కేంద్రం బాధ్యత వహించకపోవటం, పట్టించుకోకపోవటం దారుణమన్నారు.
ప్రధాన మంత్రిని కూడా తాము కలిసి మాట్లాడామని, ఆయన కూడా పరిస్థితి తనకు తెలుసు అనటం తప్ప మరేమీ స్పందించటం లేదని చెప్పారు. సీమాంధ్రలో వేల కోట్ల వ్యాపారాలు, జన జీవనం, విద్యార్థుల చదువులు దెబ్బతింటున్నాయని, కాబట్టి తెలంగాణ ప్రకటనను కాంగ్రెస్ విరమించుకోవాలని కొనకళ్ల డిమాండ్ చేశారు. సీమాంధ్ర భవిష్యత్తులో ఎడారి కాకుండా ఉండాలంటే పదవులు శాశ్వతం కాదని, ఇప్పుడు మౌనంగా కూర్చోకుండా, ఆ ప్రాంతాన్ని కాపాడుకోవటం కోసం రాజీనామాలు చేయక తప్పదని, కాంగ్రెస్ నాయకులంతా రాజీనామాలు చేసేందుకు ముందుకు రావాలన్నారు.












Click it and Unblock the Notifications